Allu Arjun: కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న పాన్ ఇండియా స్టార్ అంటే అల్లు అర్జున్ పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. ఒక సినిమా కోసం అల్లు అర్జున్ ఎంత డెడికేటెడ్ గా పనిచేస్తారు అని చాలా సినిమాలు ఇప్పటికే ప్రూవ్ చేశాయి. ముఖ్యంగా పుష్ప సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందుకే ఏకంగా నేషనల్ అవార్డు కూడా అల్లు అర్జున్ కు రావడం జరిగింది. పుష్ప సినిమాకు సంబంధించి జాతర సీన్ లో అయితే అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. ఆ పర్ఫామెన్స్ చూస్తూ ఉంటే అల్లు అర్జున్ మీద ఉన్న నెగెటివిటీ కూడా మర్చిపోతాం. కొన్ని సందర్భాలలో మాట్లాడే పద్ధతి వలన అల్లు అర్జున్ ట్రోల్ అవుతాడు. కానీ నటన గురించి పెద్దగా విమర్శలు వచ్చిన దాఖలాలు లేవు.
భాయ్ కి ఏమైంది.?
ప్రతి హీరో కెరియర్లో కొన్ని సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలను ఆ హీరోలు తిరిగి చూస్తున్నప్పుడు వాళ్లకే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక సందర్భంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ నా పాత సినిమా ఏం చూసినా నాకు ఇబ్బందిగానే ఉంటుంది అని తెలిపారు. అలానే ముఖ్యంగా ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. ఈ తరుణంలో ఎన్టీఆర్ పాత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు కొందరు. అలానే అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలోని స్టిల్స్ ఎక్కువగా షేర్ అవుతాయి. ఒక ముఖ్యంగా ఇప్పుడు అల్లు అర్జున్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోకి భాయ్ కి ఏమైంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది పరుగు సినిమాలోని ఒక పాటలోని స్టిల్. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు దానిని ట్రోల్ చేస్తున్నారు.
మరో పాన్ ఇండియా సినిమా
ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 22వ సినిమాను చేస్తున్నాడు. అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపుగా 800 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. జవాన్ సినిమా తర్వాత అట్లీ చేస్తున్న సినిమా కావడంతో అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది. ఈ సినిమాలో కూడా విఎఫ్ఎక్స్ భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు ఇదివరకే రిలీజ్ చేసిన వీడియోలో అర్థం అవుతుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశం ఉంది.
Also Read : Tollywood: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి విజయభాను మృతి!