BigTV English

Daaku Maharaaj Success Meet: ‘డాకు మహారాజ్ ‘ సక్సెస్ మీట్ లో బాలయ్య సాంగ్..

Daaku Maharaaj Success Meet: ‘డాకు మహారాజ్ ‘ సక్సెస్ మీట్ లో బాలయ్య సాంగ్..

Daaku Maharaaj Success Meet: నందమూరి నరసింహం బాలయ్య బాబు రీసెంట్ గా నటించిన మూవీ డాకు మహారాజ్.. డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ ఏడాది సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ మూవీతో మరో భారీ విజయాన్ని తన అకౌంట్ లో వేసుకున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా వంటి స్టార్స్ కీలక పాత్రల్లో  నటించారు.. ఈ మూవీ భారీ విజయనందుకు నన్ను నేపథ్యంలో సక్సెస్ మీట్ ను ఏపీ రాష్ట్రంలోని అనంతపురంలో ఏర్పాటు చేశారు.. ఈవెంట్ కి డాకు మహారాజ్  చిత్ర యూనిట్ సభ్యులందరూ హాజరయ్యారు..


సక్సెస్ మీట్ లో బాలయ్య సాంగ్.. 

బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12 న థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి రోజు నుంచి మంచి టాక్ ని అందుకున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా దుమ్ము దులిపేసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాలయ్య కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది. అయితే ఈ ఇప్పుడు థియేటర్లలో భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. తాజాగా డాకు మహారాజ్ మూవీ సక్సెస్ మీట్ ను నిర్వహించింది చిత్రయూనిట్. అనంతపురం శివారు శ్రీనగర్ కాలనీ దగ్గర ఈ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో బాలయ్య పాడిన సాంగ్ హైలెట్ అయ్యింది. ఆ సాంగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసిన బాలయ్య ఫ్యాన్స్ మా బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాలి కదా అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆ ఈవెంట్ లో బాలయ్య సాంగ్ మాత్రం బాగా ఆకట్టుంది..


డాకు మహారాజ్ కలెక్షన్స్..

బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్ము దులిపేసింది అన్న సంగతి తెలిసిందే. మొదటి రోజు నుంచే హవాను కొనసాగిస్తుంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 56 కోట్లు వసూలు చేసింది.. రెండో రోజు రూ.18 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.18 కోట్ల గ్రాస్, నాలుగో రోజు రూ.13 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.. కేవలం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 105 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. సినిమా కేవలం నాలుగు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరడం విశేషం. ఇక ఐదు రోజులకు 125 కోట్ల వరకు వసూలు చేస్తుందని సమాచారం. ఆరో రోజు తగ్గకుండా 129 కోట్లు వసూల్ చేసింది. ఇక ఏడో రోజు కూడా అంతకు మించి తగ్గకుండా 140 వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఎనిమిదోవ రోజు 161, తొమ్మిది రోజు నుంచి కాస్త కలెక్షన్స్ తగ్గినా ప్రస్తుతం పర్వాలేదనే టాక్ ను అందుకున్నాయి.. ఈ మూవీ తర్వాత అఖండ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×