OTT Movie : బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటన నైపుణ్యంతో అనతి కాలంలోనే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అమాయకంగా కనిపిస్తునే, అతడు చేసే విన్యాసాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఇతడు నటించిన ఒక మూవీ మంచి వ్యూస్ తో దూసుకుపోయింది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జి ఫైవ్ (Zee5) లో
ఈ బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బాబూమోషాయ్ బందూక్‌బాజ్‘ (Babumoshai bandookbaaz). ఈ మూవీకి కుషన్ నంది దర్శకత్వం వహించాగా, కిరణ్ శ్యామ్ ష్రాఫ్, అష్మిత్ కుందర్ నిర్మించారు. ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, బిదితా బాగ్ ప్రధాన పాత్రలు పోషించారు. గ్యాంగ్ స్టర్పాత్రలతో తిరిగే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
బాబు ఒక గ్యాంగ్ స్టర్ గా 20 వేల రూపాయలకే మర్డర్ చేస్తూ ఉంటాడు. ఇందులో పోలీస్ కి 5000 ఇస్తూ, తన గ్యాంగ్ స్టర్ వృత్తిని కొనసాగిస్తాడు. అయితే ఆ ప్రాంతంలో దూబే, సుమిత్రకి పొలిటికల్ గా శత్రుత్వం ఉంటుంది. సుమిత్ర ఒకసారి బాబుని పిలిచి ఆపోజిట్ గ్యాంగ్ లో ఒక మనిషిని చంపమని చెప్తుంది. ఆ ప్రాంతానికి వెళ్లిన బాబుకు, పుల్వా అనే చెప్పులు కుట్టుకునే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ అమ్మాయితో మాట్లాడుతూనే, ఆ విలన్ ని చంపేస్తాడు బాబు. ఈ కేసు విషయంపై పోలీస్ స్టేషన్ కి పుల్వాని తీసుకెళ్తారు పోలీసులు. చంపిన వ్యక్తి ఎవరని ఆమెను అడుగుతారు పోలీసులు. అయితే తనకు ఆ వ్యక్తి ఎవరో సరిగా గుర్తు లేదని చెప్తుంది పుల్వా. పోలీస్ స్టేషన్లో నా పేరు ఎందుకు చెప్పలేదని బాబు, పుల్వా దగ్గరికి వచ్చి అడుగుతాడు. నన్ను లవ్ చేస్తున్నావా అంటూ ఆమెతో ప్రేమలో పడతాడు.
ఆ తర్వాత సుమిత్ర మనుషులను చంపడానికి, బాబుకు కాంట్రాక్ట్ ఇస్తాడు దుబే. ఈ క్రమంలో బంకి అని మరొక వ్యక్తికి కూడా ఈ కాంట్రాక్ట్ ఇస్తాడు దుబే. బాబు, బంకి ఇద్దరూ కలిసి ఆ కాంట్రాక్ట్ ని పూర్తి చేస్తారు. అయితే బంకి, బాబుని కూడా షూట్ చేసి చనిపోయాడు అనుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత బంకి పుల్వాని కూడా చంపేస్తాడు. చాలా రోజుల వరకు బాబు హాస్పిటల్ లో కోమాలో ఉంటాడు. చివరికి బాబు కోమాలో నుంచి బయట పడతాడా? తన పరిస్థితికి కారణమైన వాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటాడా? బాబుని చంపమని చెప్పింది ఎవరు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బాబూమోషాయ్ బందూక్‌బాజ్’ (Babumoshai bandookbaaz) అనే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.