AA 22:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) చివరిగా ‘పుష్ప 2’ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని ఒక్కసారిగా షేక్ చేశారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది కూడా ఈ సినిమానే. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అలా ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో #AA22 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్ చేస్తూ ఒక మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు నాడే తెలపడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఇంటర్నేషనల్ లెవెల్ లో హాలీవుడ్ చిత్రాలతో పని చేసిన వీఎఫ్ఎక్స్ సంస్థ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.
రహస్యంగా పూజా కార్యక్రమాలు పూర్తి..
కళానిధి మారన్ ఈ సినిమాను ‘సన్ పిక్చర్స్ బ్యానర్’ పై భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త వచ్చింది. యూనిట్ కి చెందిన అతి కొద్దిమంది ప్రముఖుల సమక్షంలో అల్లు అర్జున్, అట్లీ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల ముంబైలో చాలా సింపుల్గా జరిగాయట. కాగా ఈ సినిమా షూట్ మొత్తం ముంబైలోనూ అలాగే విదేశాలలో కూడా ఉంటుందని సమాచారం. ఇప్పటికే దర్శకుడు అట్లీ.. విదేశీ లొకేషన్స్ కూడా లాక్ చేశాడని, అలాగే ఈ సినిమాకు అవతార్, స్పైడర్ మాన్, టెర్మినేటర్, వాళ్వరిన్ వంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రముఖ విఎఫ్ఎక్స్ స్టూడియో, మోషన్ స్టూడియోస్ టెక్నీషియన్స్ పనిచేయబోతున్నారు. ఇలా మొత్తానికైతే రహస్యంగా, సింపుల్ గా ముంబైలో పూజా కార్యక్రమాలు పూర్తి చేయడంతో ఎందుకు ఇలా రహస్యంగా సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
పరిశీలనలో హీరోయిన్స్ పేరు..
ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాగూర్ (Mrunhal thakur), సమంత (Samantha) ఇలా పలువురు నటిస్తున్నట్లు పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా ఎవరిని అధికారులు అధికారికంగా ఫిక్స్ చేయలేదు. ఇక బన్నీ కెరీర్ లో 22వ చిత్రంగా, అట్లీ దర్శకత్వంలో 6వ సినిమాగా వస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏది ఏమైనా హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంటుందని, ముఖ్యంగా అల్లు అర్జున్ కి హాలీవుడ్ రేంజ్ లో గుర్తింపు రావడం ఖాయమని, అంతేకాదు ఆస్కార్ వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
ALSO READ:HBD Samantha: సేల్స్ గర్ల్ నుండీ నిర్మాత వరకూ.. సక్సెస్ వెనక ఎన్నో అవమానాలు, హేళనలు..