BigTV English

Bandla Ganesh: తిరుమల కొండ మీద నుంచి చెప్తున్నా, ఖచ్చితంగా సినిమాలు తీస్తా

Bandla Ganesh: తిరుమల కొండ మీద నుంచి చెప్తున్నా, ఖచ్చితంగా సినిమాలు తీస్తా

Bandla Ganesh: వినోదం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు బండ్ల గణేష్. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసి తనకంటూ నటుడుగానే మంచి గుర్తింపును సాధించుకున్నాడు.నువ్వు నాకు నచ్చావ్, అమ్మానాన్న తమిళ అమ్మాయి, శివమణి, మల్లీశ్వరి, పోకిరి వంటి సినిమాలు బండ్ల గణేష్ కి నటుడుగా మంచి పేరును తీసుకొచ్చాయి అని చెప్పొచ్చు. అయితే బండ్ల గణేష్ నటుడుగా రీ ఎంట్రీ ఫిలిం సరిలేరు నీకెవ్వరు అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. దాంట్లో గణేష్ కి మంచి పేరు వచ్చింది.


ఇకపోతే 2009వ సంవత్సరంలో ఆంజనేయులు అనే సినిమాతో ప్రొడ్యూసర్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టాడు బండ్ల గణేష్. అయితే ఆ సినిమా బాగానే ఉన్నా కూడా కమర్షియల్ గా మంచి హిట్ కాలేదు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తీన్మార్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా ఇప్పటికీ ఒక కల్ట్ ను స్టేటస్ ను సాధించుకుంది .అయితే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా విజయాన్ని సాధించలేదు.

ఆల్ టైం ఇండస్ట్రీ హిట్


ఇకపోతే పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ కి ఎప్పటినుంచో బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే గణేష్ కి ఎప్పటినుంచో ప్రొడ్యూసర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉండేది. అది మాటల్లో పవన్ కళ్యాణ్ తో చెబుతూ ఉండేవాడు బండ్ల గణేష్. అయితే పవన్ కళ్యాణ్ దానిని సీరియస్ గా తీసుకొని బండ్ల గణేష్ కి తీన్మార్ అనే సినిమాను చేశాడు. అయితే ఆ సినిమా ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్లీ రెండవ ఛాన్స్ ని కూడా తనకిచ్చి గబ్బర్ సింగ్ అనే సినిమాను చేశాడు పవన్ కళ్యాణ్.

గబ్బర్ సింగ్ సినిమా తర్వాత బండ్ల గణేష్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఒక బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా అక్కడితో ఎదిగాడు బండ్ల. ఆ తర్వాత ఎన్టీఆర్ తో బాద్షా అనే సినిమాను తెరకెక్కించాడు బండ్ల గణేష్. ఆ సినిమా తర్వాత చేసిన ఇద్దరమ్మాయిలతో సినిమా కూడా బండ్ల గణేష్ కి మంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చి పెట్టింది.

మళ్లీ రీఎంట్రీ ఇస్తా

ఇకపోతే బండ్ల గణేష్ కి మంచి పేరును అధిక లాభాలను తీసుకువచ్చిన సినిమా అంటే టెంపర్ అని చెప్పొచ్చు. టెంపర్ సినిమా సాధించిన విజయం మామూలుది కాదు. మళ్లీ బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా అడుగుపెడితే చూడాలని చాలామంది ఎదురుచూస్తున్నారు. దీనిపై బండ్ల గణేష్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇద్దరమ్మాయిలతో సినిమా ప్రెస్ మీట్ కి సంబంధించిన పాత వీడియో ను షేర్ చేసి తిరుమల కొండ మీద నుంచి చెప్తున్నా ఖచ్చితంగా సినిమాలు చేస్తా మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొడతా అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపాడు.

Also Read : Kamal Haasan: తగ్ లైఫ్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ ను వాయిదా, దేశానికే ప్రాముఖ్యత

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×