Boycott Turkey: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ మీద దాడి చేస్తుందని ఊహాగానాలు వెలువడ్డాయి. అందుకు అనుగుణంగానే ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్ తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. భారత చర్యను ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నప్పటికీ, టర్కీ.. పాకిస్తాన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో టర్కీ తీరుపై భారతీయల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. టర్కిష్ ఎయిర్ లైన్స్ తో పాటు ఆ దేశంతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ‘బాయ్ కాట్ టర్కీ’, ‘బాయ్ కాట్ టర్కిష్ ఎయిర్ లైన్స్’ అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు పెడుతున్నారు. అటు పలు పర్యాటక, ట్రావెల్ కంపెనీలు టర్కిష్ సంస్థలతో ఉన్న సంబంధాలను తెంచుకుంటున్నాయి.
పాకిస్తాన్ కు మద్దతు తెలిపిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్
భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించిన తర్వాత టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్.. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కు సంఘీభావం తెలిపారు. భారత వైమానిక దాడులు పరిస్థితిని పూర్తి స్థాయి యుద్ధంగా మార్చగలవని ఎర్డోగన్ హెచ్చరించారు. పాకిస్తాన్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో టర్కీ-సంబంధిత వ్యాపారాలను బహిష్కరించాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. “ప్రతి భారతీయుడికి పిలుపు. మన దేశ గౌరవం, భద్రత అనేది చాలా ముఖ్యం. టర్కీ వంటి దేశాలు భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే పాకిస్తాన్‌కు, బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. మనం ఐక్యంగా నిలబడాలి. టర్కీ ఎయిర్ లైన్స్, టర్కీ పర్యాటకం కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి మన జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడే వారిని మద్దతు ఇస్తుంది. అందుకే బాయ్ కాట్ టర్కీ ఉద్యమాన్ని మొదలుపెడదాం” అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
టర్కిష్ ట్రావెల్ సంస్థలకు షాక్!
‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పెరుగుతున్న దౌత్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ట్రావెల్, టూరిజం కంపెనీలు టర్కిష్ సంస్థలతో ఉన్న భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంటున్నాయి. టర్కీతో ఎలాంటి సంబంధాన్ని కొనసాగించబోమని గోవా విల్లాస్ ప్రకటించింది. “భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న ప్రస్తుత పరిస్థితిలో టర్కీ భారత వ్యతిరేక వైఖరి కారణంగా, గోవాలో టర్కిష్ పౌరులకు ఎటువంటి వసతి సేవలను అందించకూడదని మేము నిర్ణయించుకున్నాము. మేము ఎప్పుడూ మా దేశానికి అండగా నిలబడుతాం” అని వెల్లడించింది.
Due to Turkey's non-cooperative stance in the current global scenario involving India and Pakistan, we’ve decided not to offer any accommodation services to Turkish citizens in Goa. We stand firmly with our nation.
Jai Hind 🇮🇳
— Goa Villas (@Goavilla_) May 8, 2025
అటు గో హోమ్ స్టేస్ సంస్థ టర్కిష్ ఎయిర్ లైన్స్‌తో తన భాగస్వామ్యాన్ని ముగించినట్లు ప్రకటించింది. “భారత్ పట్ల టర్కీ వ్యతిరేక వైఖరిని కలిగి ఉంది. ఈ నేపథ్యంలో టర్కిష్ ఎయిర్ లైన్స్ తో మా భాగస్వామ్యాన్ని అధికారికంగా ముగించుకుంటున్నాము. ఇకపై వారి విమానాలను మా అంతర్జాతీయ ప్రయాణ ప్యాకేజీలలో చేర్చము” అని వెల్లడించింది.
We are officially ending our partnership with Turkish Airlines due to their unsupportive stance towards India. Going forward, we will no longer include their flights in our international travel packages. Jai Hind
— Go Homestays (@GoHomestay) May 8, 2025
మరోవైపు టర్కిష్ ఉత్పత్తులు, పర్యాటకాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ కు టర్కీ మద్దతు ఇవ్వండపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ‘ఆపరేషన్ సిందూర్’ ఎఫెక్ట్, రద్దైన విమానాలకు రీఫండ్ ఇస్తారా?
May 9,2025 11:49 am