Keshav Maharaj : సాధారణంగా క్రికెట్ లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇంకా ముందు ముందు కూడా చూడబోతాం. పలు ఆసక్తికర, చిత్ర, విచిత్ర, వైరల్, ఫన్నీ, సీరియస్ ఇలా రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొన్ని ఆశ్యర్యకర సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలను మనం ఎన్నో చూశాం. వాటిలో ముఖ్యంగా కొందరూ చిత్ర విచిత్రంగా రన్ ఔట్ కావడం.. గల్లీ క్రికెట్ ను రకరకాలుగా ఆడటం.. గల్లీ క్రికెట్ ని బట్టలు విప్పి ఆడటం, అలాగే కొందరూ రాక్షసుడిలా వ్యవహరించడం, మరికొందరూ ఫన్నీ గా ఆడటం ఇలా రకరకాలు గా చూశాం. కేవలం గల్లీ క్రికెట్ మాత్రమే కాదు.. నేషనల్, ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ల్లో కూడా ఇలాంటి ఆసక్తికర సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. క్రికెట్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : WTC 2025 Final : ఉత్కంఠగా మారిన WTC ఫైనల్.. గెలిచేది ఎవరంటే..?
ముఖ్యంగా హిందూ మతంలో “ఓం” సింబల్ కి ఎంత ప్రత్యేకత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే.. ప్రముఖ క్రికెటర్, సౌతాఫ్రికా ఆల్ రౌండర్ కేశవ్ మహరాజ్ బ్యాట్ పై ఓం గుర్తు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ అభిమానులు మహరాజ్ బ్యాట్ పై ఓం గుర్తు గుర్తించారు. హిందూ మతంలో గౌరవ ప్రదమైన మంత్రం అయిన ఈ చిహ్నం బ్యాట్ పై ఉండటం ఏంటి..? అని అంతా ఆశ్యర్యపోతున్నారు. సౌతాఫ్రికా క్రికెటర్ బ్యాట్ పై ఓం సింబల్ ఏంటి..? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మరోవైపు ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అప్పట్లో ఓ వివాదస్పద పోస్ట్ కూడా చేశాడు. అలాగే పాకిస్థాన్‌తో జరగనున్న MCG టెస్ట్‌లో మానవతా సమస్యలపై అవగాహన కల్పించేందుకు తన షూ మరియు బ్యాట్ పై పావురం లోగోను ప్రదర్శించాలని ఉస్మాన్ ఖవాజా చేసిన విజ్ఞప్తిని ICC తిరస్కరించింది. బాక్సింగ్ డే టెస్ట్ కోసం, ఎడమ చేతి వాటం ఓపెనర్ తన షూ మరియు బ్యాట్‌పై ఆలివ్ కొమ్మను పట్టుకున్న చిన్న పావురాన్ని ప్రదర్శించమని ICCకి దరఖాస్తు చేసుకున్నాడు. మానవ హక్కుల సార్వత్రిక డిక్లరేషన్‌లోని ఒక కథనానికి ఇది సూచన అని ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా మానవులందరూ స్వేచ్ఛగా, గౌరవం, హక్కులతో సమానంగా జన్మించారు. వారు మనస్సాక్షిని కలిగి ఉ:టారు. సోదర భావంతో ఒకరితో మరొకరూ వ్యవహరించాలని రాసుకొచ్చారు. ఇది అప్పుడు వైరల్ అయింది. వాస్తవానికి ఇది ఇప్పుడు చేసింది కాదు.. గతంలో కేశవ్ మహారాజ్ బ్యాట్ పై ఓం సింబల్ వెలుగులోకి వచ్చినది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.