Bandla Ganesh : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా, హీరోగా, నటుడిగా, నిర్మాతగా పేరు దక్కించుకున్న బండ్ల గణేష్ (Bandla Ganesh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈయన నిర్మాత అని చెప్పడం కంటే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భక్తుడుగానే ఎక్కువ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకొని, అటు ఆర్థికంగా కూడా స్థిరపడ్డారు బండ్ల గణేష్. ఇక బండ్ల గణేష్ ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ ను ఆరాధ్య దేవుడిగా భావించేవాడు. పవన్ కళ్యాణ్ కు నమ్మిన బంటుగా ఉన్న బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి తాను హనుమంతుడు లాంటివాడిని అంటూ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ (Trivikram) వల్లే తాను పవన్ కళ్యాణ్ కు దూరం అయ్యానని ఎన్నో సందర్భాలలో ఈ విషయాన్ని తెలియజేశారు.
ముఖ్యంగా కొన్ని దుష్టశక్తులు పవన్ కళ్యాణ్ ను కలవకుండా చేశారని, ఎన్నో రకాల ట్వీట్లు వేస్తూ తన బాధను వ్యక్తపరిచేవారు బండ్ల గణేష్. అప్పుడప్పుడు త్రివిక్రమ్ ను గురూజీ అని సంబోధిస్తూ ట్వీట్లు వేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే వీరి ముగ్గురు మధ్య ఉన్న సమస్య ఏంటి అన్నది మాత్రం ఇప్పటివరకు బయటపడలేదు. అయితే ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ పై సెటైర్ వేస్తూ బండ్ల గణేష్ వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ తాజాగా తన ఎక్స్ ఖాతా ద్వారా..”కొందరితో సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి. వాళ్లతో ఎంత ప్రేమగా ఉన్నా.. ఎంత నిజాయితీగా ఉన్నా.. వాళ్ళు ఎప్పటికీ మన వాళ్లు కారు..! ” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కరు బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి, ఈ ట్వీట్ వేశారా? అని అందరూ అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ను ఎంత నమ్మినా తనను దూరం పెట్టాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బండ్ల గణేష్. మరి బండ్ల గణేష్ ఆవేదనను పవన్ కళ్యాణ్ అర్థం చేసుకొని.. ఇప్పటికైనా దగ్గరకు తీసుకుంటారేమో చూడాలి.
బండ్ల గణేష్ కెరియర్..
ఇక బండ్ల గణేష్ విషయానికి వస్తే.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈయన నిర్మాత అయ్యే ముందు చాలాకాలం చిన్న నటుడిగా ఇండస్ట్రీలో పనిచేశారు. సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించిన ఈయన.. నిర్మాతగా మారి గబ్బర్ సింగ్, ఆంజనేయులు, తీన్మార్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాలు నిర్మించారు. అంతేకాదు ఇటీవల హీరోగా కూడా మారిన విషయం తెలిసిందే. ఇక అప్పుడప్పుడు కమెడియన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న బండ్ల గణేష్ ..రాజకీయంగా కూడా పలు కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇక సమాజంలో జరిగే పలు అంశాలపై స్పందిస్తూ.. ఈయన పెట్టే ట్వీట్ కి సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉందని చెప్పాలి. ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ పై సెటైర్ వేస్తూ చేసిన ట్వీట్ కూడా క్షణాల్లో వైరల్ గా మారింది.
కొందరితో సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి వాళ్లతో ఎంత ప్రేమగా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా వాళ్ళు ఎప్పటికీ మన వాళ్లు కారు…….!
— BANDLA GANESH. (@ganeshbandla) February 24, 2025