BigTV English

Prabhas : ఏంటి నాయన ఇప్పుడే లేచావా.. ప్రభాస్‌‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు

Prabhas : ఏంటి నాయన ఇప్పుడే లేచావా.. ప్రభాస్‌‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు

Prabhas : భారతదేశ పౌరులు అందరూ ఉడికిపోతున్నారు. గత నెల ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోవడంతో… ప్రతికార జ్వాలతో రగిలిపోతున్నారు. సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖలతో పాటు సమాన్య ప్రజలకు కూడా ఈ ఉగ్రదాడిపై స్పందించారు.


ఇక కొద్ది రోజులకే భారత ప్రభుత్వం కూడా ఉగ్రవాదులకు, వారి సపొర్ట్ చేసిన వాళ్లను ఏరేయడానికి ‘ఆపరేషన్ సింధూర్’ అనే మిషన్ ను మే 7వ తేదీన స్టార్ట్ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ తమ తమ సోషల్ మీడియా వేదికగా రెస్పాన్స్ అయి.. ప్రభుత్వానికి, ఇండియన్ ఆర్మీకి అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ అంటూ పేరు తెచ్చుకున్న ప్రభాస్‌ను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం..

మే 7 తెల్లవారుజామున ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసిన తర్వాత ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సింధూర్’ ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. దీని లక్ష్యం పెహల్గాం దాడికి కారుకులైన ఉగ్రదాడులను మట్టుపెట్టడం, అలాగే ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మిలించడమే అని కూడా ఆర్మీ అని అనౌన్స్ చేసింది.


భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు అందరూ సపొర్ట్ చేశారు. కానీ, వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్న.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి మాత్రం ‘ఆపరేషన్ సింధూర్’ మద్దతకు సంబంధించి ఎలాంటి పోస్ట్ రాలేదు.

కానీ, నిన్న (శుక్రవారం) అర్థరాత్రి ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రెస్పాండ్ అయ్యాడు. INDIA STANS TALL… #OPERATIONSINDOOR అంటూ ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు. అదే ఇప్పుడు ప్రభాస్ ను విమర్శలపాలు చేస్తుంది. ‘ఆపరేషన్ సింధూర్ స్టార్ట్’ అయి మూడు రోజులు గడుస్తుంది. పాకిస్థాన్ లో చాలా మంది ఉగ్రవాదలను ఆర్మీ మట్టుపెట్టింది. అలాగే పాక్ దుశ్చర్య వల్ల సరిహద్దుల్లో అమాయక ప్రజలు చాలా మంది ప్రాణాలు విడిచారు. మురిళీ నాయక్ అనే తెలుగు వీరుడు వీరమరణం పొందాడు.

ఇన్నీ జరిగినా.. ఈ పాన్ ఇండియా స్టార్ కి తెలియలేదా…? అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఆయనగారి సినిమాలు ఇండియా అంతా చూడాలి. ఆయనకు మాత్రం ఇండియాలో ఏం జరుగుతుందో తెలీదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘నువ్వు పాన్ ఇండియా స్టార్ గా పనికి రావు. అనర్హుడివి’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Prabhas Insta Story
Prabhas Insta Story

ఇటలీలో ఉన్నాడు..?

కాగా, ప్రభాస్ ప్రస్తుతం ఇటలీ వెకేషన్‌లో ఉన్నాడు. ఆయన ప్రతి సమ్మర్ కి అక్కడికే వెళ్తాడు. ఇటలీలోని ఓ పల్లెటూర్‌లో ప్రభాస్ పంటపోలాల మధ్య ఓ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన సినిమాలను అన్నింటినీ పక్కన పెట్టి అక్కడే వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.

అక్కడ ఈజీగా సమాచారం అందదు.. ?

ప్రభాస్ ఉంటున్న ఆ చిన్న పల్లెటూర్‌లో నెట్‌వర్క్ సిస్టమ్ అంతగా ఉండదని, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అని.. అందుకే ప్రభాస్ కు ఈ విషయం తెలియకపోవచ్చు అని కూడా కామెంట్స్ వస్తున్నాయి.

సాయంలో ఎప్పుడూ ముందు ఉండే రాజు..

సమాచార లోపం వల్లే ఆపరేషన్ సింధూర్ పై రెస్పాండ్ అవ్వడం లేట్ అయిందని, సాధారణంగా ఇండియాలో ఎక్కడ కష్టం వచ్చినా… స్పందించిందే.. ఆర్థిక సాయం చేసేది.. ప్రభాస్ రాజే అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×