BigTV English

Basheer Master : శేఖర్ మాస్టర్ వేస్ట్ ఫెలో.. ఇంత దారుణంగా తిట్టారేంటి మాస్టర్..?

Basheer Master : శేఖర్ మాస్టర్ వేస్ట్ ఫెలో.. ఇంత దారుణంగా తిట్టారేంటి మాస్టర్..?

Basheer Master : తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ కొరియో గ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న వారిలో మొదటగా వినిపిస్తున్న పేరు శేఖర్ మాస్టర్.. ఈ మధ్య ఏ సాంగ్ చేసిన మాస్టర్ పేరే వినిపిస్తుంది. దివంగత రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసి.. ఆ తర్వాత సొంతంగా అవకాశాలు అందుకుని ఎంతో కష్టపడి స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగాడు శేఖర్. మెగాస్టార్ చిరంజీవిని అమితంగా అభిమానించే శేఖర్ చిరుతో కూడా స్టెప్పులు వేయించాడు. ప్రస్తుతం తెలుగులో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ కొనసాగుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపించడానికి ప్రయత్నించే శేఖర్.. ఈ మధ్య ఒక రకమైన మూసలోకి వెళ్లిపోతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన స్టెప్పులు కొన్ని చర్చనీయాంశంగా మారుతున్నాయి.. తాజాగా బాలయ్య మూవీ సాంగ్ లో ఆయన కంపోజ్ చేసిన స్టెప్పుల పై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. మాస్టర్ స్టెప్పుల పై బషీర్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


శేఖర్ మాస్టర్ స్టెప్పులపై విమర్శలు.. 

గత ఏడాది భారీ అంచనాలతో రిలీజ్ అయిన రవితేజ సినిమా ‘మిస్టర్ బచ్చన్’లోని సితార్ పాటలో శేఖర వేయించిన స్టెప్పులు వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా హీరోయిన్ బ్యాక్ మీద తబలాలా వాయించడం.. అలాగే బొడ్డు కింద చేయిపెట్టి డ్రెస్ లాగడం లాంటి స్టెప్స్ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.. దానికి ఆయన సర్ది చెప్పడంతో కాస్త ఆగాయి. ఆ తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 లోని పీలింగ్స్ సాంగ్ పై కూడా విమర్శలు వినిపించాయి. ఈ స్టెప్స్ రెండో కోవకే చెందుతాయనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ‘డాకు మహారాజ్’ నుంచి రిలీజైన ‘దబిడి దిబిడి’ పాటలో స్టెప్స్ మీద మరింతగా విమర్శలు వస్తున్నాయి. ఈ పాటకు కూడా కొరియోగ్రాఫర్ శేఖరే. మూడు పాటల్లోనూ హీరోయిన్ బ్యాక్ మీద దరువు వేయడం కామన్‌గా కనిపిస్తుంది. అలాగే ‘సితార్’ పాటలో బొడ్డు కింద చేయి పెట్టి డ్రెస్ లాగే షాట్స్ కూడా మిగతా రెండు పాటల్లోనూ ఉన్నాయి. ఇలా రొమాంటిక్ స్టెప్స్ పేరుతో శేఖర్ హీరోలతో గీత దాటించేస్తున్నాడని.. సినిమాలను తప్పు ద్రోవ పట్టించేలా స్టెప్పులు వేస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. తాజాగా శేఖర్ మాస్టర్ స్టెప్పుల పై మరో కొరియోగ్రాఫర్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో ట్రెండ్ అవుతుంది..


శేఖర్ మాస్టర్ స్టెప్పుల పై బషీర్ మాస్టర్ కామెంట్స్.. 

ప్రముఖ కొరియో గ్రాఫర్ బషీర్ మాస్టర్ తాజాగా బిగ్ టీవీతో మాట్లాడారు.. శేఖర్ మాస్టర్ కు అసలు డ్యాన్స్ రాదు.. ఆయన వేసే ప్రతి స్టెప్ లో రాకేష్ మాస్టర్ కనిపిస్తాడు.. ప్రతి స్టెప్ ఆయన కాపీ కొట్టారు. ఢీ లో ఏదో స్టెప్పులు వేసుకొనే వాడు ఇలాంటి స్టెప్పులు వెయ్యడం సిగ్గుగా ఉంది.. ఇక దబిడి దిబిడి సాంగ్ లో వేసిన స్టెప్పులపై దారుణంగా కామెంట్స్ చేశారు. ఒక ఎమ్మెల్యే, సీనియర్ హీరో అయిన బాలయ్య లాంటి వ్యక్తితో ఇలాంటి స్టెప్పులు వేయించడం బాధకారం.. జనాలు ఒప్పుకోవడం కష్టమే.. ఆయన తీరు మార్చుకొని సొంతంగా స్టెప్పులు వేస్తే జనాలు ఆదరిస్తారు లేకుంటే మాత్రం ఇక అంతే.. జానీ మాస్టర్ పరిస్థితి తప్పదు అన్నట్లు మాట్లాడారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో బషీర్ మాస్టర్ ను సపోర్ట్ చేస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై శేఖర్ మాస్టర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×