Mohammed Waleed: పాకిస్తాన్ దేశవాళీ క్రికెట్ లో ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీ క్వైడ్ – ఈ – అజామ్ ట్రోఫీలో భాగంగా పెషావర్ – సియల్ కోట్ మధ్య కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. క్రికెట్ అంటేనే ఉత్కంఠకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.
Also Read: Chahal – Dhanushshree: అతనితో రిలేషన్.. భార్య ఫోటోలు డిలీట్ చేసిన చాహల్.. ఇక విడాకులే ?
ముఖ్యంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రన్స్ ని కట్టడి చేసేందుకు ప్లేయర్లు చేసే విన్యాసాలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని కొన్ని సార్లు రనౌట్ అవకాశం లేని సమయంలో కూడా మెరుపు వేగంతో బాల్ విసిరి రనౌట్ చేయడం కూడా క్రికెట్ లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అందుకే క్రికెట్ అంటే ఉత్కంఠకు చిరునామా అని చెబుతుంటారు. అయితే క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో రనౌట్ అయ్యాడు సియల్ కోట్ బ్యాటర్ మహమ్మద్ వాలీద్.
ఇలా కూడా అవుట్ అవుతారా..? అనే రీతిలో అతను పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ రనౌట్ ని చూసి నెటిజెన్లు నోరేళ్లబెడుతున్నారు. మహమ్మద్ వాలీద్ {Mohammed Waleed} దరిద్రానికే బ్రాండ్ అంబాసిడర్ అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. పెషావర్ బౌలర్ మహమ్మద్ అమీర్ ఖాన్ వేసిన 49వ ఓవర్ లో ఈ రనౌట్ చోటుచేసుకుంది. అమీర్ ఖాన్ 49.5 బంతిని వేసిన సందర్భంలో.. ఆ బంతిని మహమ్మద్ వాలీద్ బౌలర్ వైపే డిఫెండ్ చేశాడు.
ఆ బంతిని అందుకున్న బౌలర్ అమీర్ ఖాన్.. వెంటనే వికెట్ల వైపు బలంగా విసిరాడు. అయితే ఆ బంతి తనకు తాకుతుందేమోనని వాలీద్ తన కుడికాలిని పైకి లేపుతూ జంప్ చేశాడు. దీంతో ఆ బంతి వికెట్లను తాకింది. వెంటనే పెషావర్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్ సమీక్ష కోరారు. అయితే ఆ రనౌట్ ని పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి స్టంప్స్ ని తాకే సమయంలో వాలీద్ గాళ్ళో ఉన్నాడని తేల్చారు. ఇంకేముంది.. వాలీద్ పెవిలియన్ చేరాడు.
Also Read: Sourav Ganguly Daughter: సౌరబ్ గంగూలీ కుమార్తెకు తృటిలో తప్పిన ప్రమాదం !
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఈ డిస్మిసల్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాటర్ క్రీజ్ లో ఉండగానే బంతిని విసరాల్సిన అవసరం ఏముంది..? అని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇది బౌలర్ తప్పిదమేనని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు అంతర్జాతీయ క్రికెట్ లో జరగకపోవడంతో సరైన రూల్స్ లేవని.. ఎంతైనా పాకిస్తాన్ రూల్స్ అదుర్స్ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Strange dismissal 😲
Mohammad Waleed gets out in a bizarre manner ❌#QeAT | #SKTvPSH pic.twitter.com/0SEGUaqIC4
— Pakistan Cricket (@TheRealPCB) January 3, 2025