Bellamkonda Sai Srinivas: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. అల్లుడు శీను సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి శ్రీనివాస్. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమా దర్శకుడుగా వినాయక్ కు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుత స్టార్ దర్శకుడు బాబి ఈ సినిమాకు కథ అందించారు. ఈ సినిమా తర్వాత వరుసగా తన కెరియర్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు సాయి. అయితే సాయి శ్రీనివాస్ సినిమాలు థియేటర్ కంటే కూడా యూట్యూబ్లోనే ఎక్కువ ఆడింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ సాయి శ్రీనివాస్ సినిమాలను విపరీతంగా ఆదరించారు. మిలియన్స్ లో ఈ సినిమాకు వ్యూస్ వచ్చేవి.
ఛత్రపతి సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమాతోనే ప్రభాస్ కు కమర్షియల్ సక్సెస్ రావడం మాత్రమే కాకుండా ఒక స్టార్ హీరో ఇమేజ్ కూడా వచ్చింది. ఎప్పుడో విడుదలైన ఈ సినిమాను బాలివుడ్ లో రీసెంట్ గా రీమేక్ చేశారు. ఈ సినిమా బాలీవుడ్ లో ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. దీని గురించి తన మాటల్లో రెస్పాండ్ అయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ సినిమా సైన్ చేసినప్పటికీ కాంతారా,పుష్ప వంటి సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. సైన్ చేసిన తర్వాత కోవిడ్ రావడం. ఇటువంటి సినిమాలు అన్ని బాగా పాపులర్ అవడం వలన ఛత్రపతి సినిమాకు అనుకున్న సక్సెస్ రాలేదు. ఆ సినిమాను నేను ముందే చేసి ఉంటే చాలా బాగుండేది అంటూ చెప్పుకొచ్చాడు.
భైరవం సినిమాతో ప్రేక్షకులు ముందుకు
సినిమా ఫలితం పక్కన పెడితే ఒక సినిమా కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెట్టే కష్టం మాత్రం జెన్యూన్ గా ఉంటుంది. ఇప్పటివరకు తాను చేసిన అన్ని సినిమాలు కూడా తానే బాధ్యత వహిస్తాడు. సినిమా రిజల్ట్ తేడా కొట్టినా కూడా ఆ బాధ్యతను తనే తీసుకుంటాడు. ఇప్పటివరకు చేసిన సినిమాల విషయంలో తనకు రిగ్రేట్ లేదు అంటూ పలు ఇంటర్వ్యూస్ లో తెలిపాడు. ఇక ప్రస్తుతం వస్తున్న భైరవం సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.