Bellamkonda Sai Srinivas : ఒక తెలుగు ఫిలిం హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అల్లుడు శీను సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్ మొదటి సినిమాతోనే మంచి పేరును సాధించుకున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగాడు సాయి శ్రీనివాస్.
సాయి శ్రీనివాస్ కెరియర్లో ఎన్నో మంచి సినిమాలు ఉన్నాయి. అన్నిటిని మించి యాక్షన్ సినిమాలు ఉన్నాయి. సినిమాలు థియేటర్లో అనుకున్న సక్సెస్ సాధించక పోయినా కూడా యూట్యూబ్లో మాత్రం ఒక సంచలనమని చెప్పాలి. నార్త్ ఆడియన్స్ కి ఈ సినిమాలు పిచ్చిపిచ్చిగా ఎక్కేసాయి. అందుకని చత్రపతి సినిమాను బాలీవుడ్ రీమేక్ చేశారు. కానీ ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.
ఆ కాంబినేషన్ రిపీట్
తమిళ్లో సంచలనం సృష్టించిన సినిమా రాక్షసన్. ఆ సినిమాను తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. మళ్లీ ఈ కాంబినేషన్ ఇప్పుడు మరో సినిమా చేయబోతుంది. బాలీవుడ్ లో హిట్ అయిన కిల్ సినిమాను తెలుగులో చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజ ఈ నెల 11 వ తారీఖున జరగనుంది.
ఆ కోలీవుడ్ హీరో తో
కోలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోస్ లో ధ్రువ్ విక్రమ్ ఒకరు. విక్రమ్ కుమారుడుగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ధ్రువ్. ఆదిత్య వర్మ సినిమాతో మంచి పేరును సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత చేసిన మహాను సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. అయితే ఇప్పుడు కిల్ సినిమాను కోలీవుడ్లో ధ్రువ్ చేయబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాకు కూడా రమేష్ వర్మ దర్శకత్వం చేస్తారు.
మళ్లీ అవసరమా.?
రీసెంట్ టైమ్స్ లో ప్రేక్షకులు మైండ్ సెట్ కంప్లీట్ గా మారిపోయింది. చూసిన సినిమాని మరోసారి చూడటానికి ఇష్టపడటం లేదు. అలానే ఒక సినిమా బాగుంది అంటే ఆ సినిమాను చూడకుండా వదలరు. భాషతో సంబంధం లేకుండా ఆ సినిమాలను చూస్తుంటారు. ఇప్పుడు కూడా కిల్ సినిమాను దాదాపు ప్రేక్షకులు అందరూ కూడా చూసేశారు. ఆ సినిమాను మళ్ళీ రీమేక్ చేయడం ఎందుకు అనేది చాలామంది అభిప్రాయం.
Also Read : Sukumar: మీ వల్లనే నాకు ఇంకో సినిమా అవకాశం వచ్చింది, సుకుమార్ ఎమోషనల్