Nushrratt Bharuccha: ప్రముఖ హీరోయిన్ నుష్రత్ భరుచ్చా (Nushrratt Bharuccha) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో నటించిన ఛత్రపతి సినిమాలో హీరోయిన్ గా నటించి పేరు దక్కించుకున్న ఈమె.. బాలీవుడ్ నటిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే ఇదిలా ఉండగా ప్రస్తుతం తాను మోడీ లేకపోతే అప్పుడే చనిపోవాల్సిందాన్ని అంటూ కామెంట్లు చేస్తూ.. ఒక ఎమోషనల్ వీడియోని కూడా షేర్ చేసింది. ఇజ్రాయెల్ లో హైఫా ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడానికి వెళ్లిన ఈమె హమాస్ చేసిన మెరుపు దాడుల కారణంగా ఆ దేశంలో చిక్కుకుపోయింది. ఒక్కసారిగా తన బృందంతో సంప్రదింపులు ఆగిపోవడంతో.. ఈమెకు ఏదైనా ప్రమాదం జరిగిందా అనే ఆందోళనలు కూడా వ్యక్తం చేశారు. చివరికి ఎలాగోలా ఈమె స్నేహితులను కాంటాక్ట్ అయ్యి.. ఈమె యోగక్షేమాల గురించి బృందం తెలుసుకోగలిగింది. ఫైనల్ గా ఎంబసీ సహకారంతో మరుసటి రోజే ఇండియాకు తిరిగి వచ్చేసింది. అయితే ఈ గ్యాప్ లో తాను నరకయాతన అనుభవించానని.. ప్రధాని మోదీ గనక చొరవ తీసుకొని ఉండకపోయి ఉంటే నాడే చనిపోయేదాన్ని అంటూ తెలిపింది.
మోడీ లేకపోతే అప్పుడే చనిపోయేదాన్ని – నుష్రత్..
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా.. 2025 ఏప్రిల్ 9న రైజింగ్ భారత్ సమ్మిట్ ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నుష్రత్ తన కెరియర్లో జరిగిన అనేక అంశాల గురించి అలాగే ఇజ్రాయిల్ లో చిక్కుకున్నప్పుడు తన అనుభవం ఎలా ఉంది. అనే విషయాలను వెల్లడించింది. ఈవెంట్ కి సంబంధించిన వరుస ఫోటోలను కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేస్తూ.. భారత ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేసింది. ముఖ్యంగా చర్యలు తీసుకొని తనను వెంటనే ఇజ్రాయిల్ నుండి సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చిన మోడీకి రుణపడి ఉంటాను అంటూ తెలిపింది.
రైసింగ్ భారత్ సమ్మిట్ లో మోడీకి కృతజ్ఞతలు తెలియజేసిన నుష్రత్..
తన ఇంస్టాగ్రామ్ వేదికగా..”CNN – News 18 రైసింగ్ భారత్ సమ్మిట్ లో గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసే అవకాశం లభించినందుకు నిజంగా గౌరవంగా అనిపిస్తోంది. ఇటీవల ఇజ్రాయిల్ లో నేను చిక్కుకున్నప్పుడు భారతీయ పౌరులను నాతో సహా తిరిగి ఇండియాకు తీసుకురావడానికి భారత ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన చర్యకు, మీ తిరుగులేని నాయకత్వానికి, మీ వ్యక్తిత్వానికి ధన్యవాదాలు తెలపడం చాలా సంతోషంగా ఉంది” అంటూ తెలిపింది. అంతేకాదు ఈమె ప్రధానమంత్రి మోడీతో మాట్లాడిన వీడియోని, ఫోటోలను కూడా షేర్ చేసుకుంది. అంతేకాదు ఆ వీడియోలో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మనం వినవచ్చు. అటు నరేంద్ర మోడీ, ఇటు నుష్రత్ ఇద్దరూ కూడా గుజరాతీ భాషలో సంభాషించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 2023లో హైఫా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా తన సినిమా ప్రదర్శన కోసం ఇజ్రాయిల్ కి వెళ్ళింది. అక్కడ పాలస్తీనియన్ ఇస్లామిస్ట్ గ్రూపు హమాస్ ఘోరమైన దాడి చేయగా.. ఆ ప్రాంతంలో 36 గంటల పాటు ఈమె చిక్కుకుపోయింది. ఇక భారత ప్రధాని మోడీ సహాయంతోనే ఇండియాకు తిరిగి వచ్చింది.