BigTV English

Viral News: బాలిలో ఇన్ ఫ్లుయెన్సర్ హనీమూన్ వెకేషన్.. ఆటాడేసుకుంటున్న నెటిజన్లు.. ఎందుకంటే?

Viral News: బాలిలో ఇన్ ఫ్లుయెన్సర్ హనీమూన్ వెకేషన్.. ఆటాడేసుకుంటున్న నెటిజన్లు.. ఎందుకంటే?

Priya Tiwari: ప్రియా తివారీ..  సోషల్ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్. ఇన్‌ స్టాగ్రామ్‌ లో 8 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ఈమె పోస్టు చేసే వీడియోలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. తన అందచందాలను చూపిస్తూ, కుర్రకారును కట్టిపడేస్తుంది. ఈ ముద్దుగుమ్మకు రీసెంట్ గా పెళ్లైంది. భర్తతో కలిసి హనీమూన్ కు వెళ్లింది. తాజాగా ఇండోనేషియాలోనే బాలిలో హనీమూన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అక్కడే అసలు సమస్య వచ్చిపడింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం అయ్యిందంటే?


ప్రియా తివారీ అబద్దం చెప్పిందా?

కొత్త పెళ్లి కూతురు బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఈ వీడియోలో ప్రియా  పెళ్లి గాజులు ధరించింది. ఆమె చేతులకు, కాళ్లకు మెహందీ కనిపిస్తోంది. కాళ్లకు ఉన్న పట్టీలు కూడా ఆకట్టుకుంటున్నాయి. వీపుపై బ్యాగ్ వేసుకుని బీచ్‌ లో  డ్యాన్స్  చేస్తూ కనిపించింది. ఛలే జైసే హవాయేన్ సనన్ పాటకు అనుగుణంగా నృత్యం చేసింది. సంతోషంగా నవ్వుతూ ఎంజాయ్ చేసే ఈ వీడియోను ‘బాలిలో సరదాగా ఉంది’ అనే క్యాప్షన్ తో అభిమానులతో పంచుకుంది. నెటిజన్లు మామూలు వాళ్లు కాదు కదా. ఒక వీడియోను షేర్ చేస్తే, దాని వెనుకున్న కథంతా తవ్వి తీయడంలో ముందు ఉంటారు. ఇక ఈమె వీడియోను కూడా నెటిజన్లు క్లోజ్ గా అబ్జర్వ్ చేశారు. కొంత మందికి ఈ వీడియో ఏదో తేడాగా ఉందే? అనే అనుమానం కలిగింది. బాలిలోని బీచ్ వీడియోలను, ఈ వీడియోను కంపార్ చేశారు. అక్కడే అసలు విషయం బయటపడింది. ఈ వీడియో అసలు బాలిలోనే తీయలేదని గుర్తించారు. ఇంతకీ ఈ వీడియో ఎక్కడ షూట్ చేశారని ఆరా తీశారు.


Read Also: తాబేళ్లను చంపి టూత్ పేస్ట్ తయారీ.. ఇదీ అసలు కథ!

బాలి కాదు గోవాలోనట!

ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు ప్రియా అబద్దం చెప్పిందని కనిపెట్టారు. ఇండోనేషియాలోని బాలి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు ఆమె చెప్పినప్పటికీ, అది బాలి కాదు, గోవా అని గుర్తించారు. సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉన్న వాళ్లు కూడా అబద్దాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోహిత్ శాండిల్య అనే నెటిజన్ ఫస్ట్ ఈ నిజాన్ని బయటపెట్టాడు. “ఉత్తర గోవాను బాలి అని పిలవరు” అని కామెంట్ చేశాడు. రాజేష్ అనే మరో నెటిజన్ “ఇది గోవా మేడమ్, బాలి కాదు” అని వ్యాఖ్యానించాడు. “నువ్వు బాలి బీచ్‌ లో చీర కట్టుకుని ఉంటే బాగుండేది. ఇంకా వైరల్ అయ్యేదానివి” అని మరో వ్యక్తం కామెంట్ చేశాడు. మొత్తంగా ఆమె బాలి బీచ్ లో కాదు, గోవాలో ఉందని నెటిజన్లు తేల్చేశారు. అయినప్పటికీ ఆమె, తన వీడియోను అలాగే ఉంచింది. ప్రస్తుతం ఈ వీడియో 8 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.

Read Also:20 ఏళ్లుగా గుండె ఆపరేషన్లు.. చివరకు అతడో దొంగ డాక్టర్ అని తెలిసి..

Related News

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Viral Video: దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Big Stories

×