Vijay Deverakonda : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ లో తరుణ్ భాస్కర్ ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలు పెట్టిన తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడుగా మారాడు. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. విజయ్ దేవరకొండ కెరియర్ కి ఈ సినిమా పెద్ద ప్లస్ అయింది.
ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ కు వరుసగా అవకాశాలు వచ్చాయి. సినిమా తర్వాత చేసిన ఈ నగరానికి ఏమైంది సినిమా కూడా మంచి హిట్ అయింది. అయితే ఈ సినిమా రీ రిలీస్ కి బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. ఇక విజయ్ దేవరకొండ కూడా పెళ్లిచూపులు సినిమాతో తర్వాత బిజీగా మారిపోయాడు. అయితే పరశురాం దర్శకత్వంలో గీత ఆర్ట్స్ నిర్మించిన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి గీత ఆర్ట్స్ సినిమా చేస్తారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు.
మరోసారి తరుణ్ భాస్కర్ తో
దర్శకుడు తరుణ్ భాస్కర్ చివరగా కీడాకోలా సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా గీత ఆర్ట్స్లో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి బినామీ అనే టైటిల్ని ఫిక్స్ చేశారని సమాచారం. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే పెళ్లిచూపులు సినిమా వచ్చి సక్సెస్ అయింది కాబట్టి, ఈ కాంబినేషన్ మీద మరోసారి అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ సినిమాను కూడా అద్భుతంగా డిజైన్ చేశాడు తరుణ్ భాస్కర్ అని తెలుస్తుంది. దీని గురించి అధికార ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
వరుస సినిమాలతో బిజీ
ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ నటించిన కింగ్డమ్ సినిమా త్వరలో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ అయిన టీజర్ మంచి అంచనాలను పెంచింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ సింగల్ కు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమా తర్వాత రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన్ అనే సినిమాను చేయనున్నాడు. దీంతోపాటు రాహుల్ దర్శకత్వంలో కూడా ఒక రాయలసీమ బ్యాగ్రౌండ్ సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. గీతా ఆర్ట్స్ లో చేయబోయే సినిమా గురించి త్వరలో అధికారికి ప్రకటన రానుంది.