BigTV English

Bhagavanth Kesari Review : భగవంత్ కేసరి.. బాలయ్యకు హ్యాట్రిక్ సక్సెస్ ఇచ్చిందా ?

Bhagavanth Kesari Review : భగవంత్ కేసరి.. బాలయ్యకు హ్యాట్రిక్ సక్సెస్ ఇచ్చిందా ?

Bhagavanth Kesari Review: వయసుతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఓ కమర్షియల్ సక్సెస్ సాధిస్తూ దూసుకుపోతున్న హీరో బాలకృష్ణ. హిట్ మీద హిట్ కొడుతూ కుర్ర హీరోలకి టఫ్ కాంపిటేషన్ ఇస్తున్న బాలయ్య.. హ్యాట్రిక్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ ఈరోజు రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి బాలయ్య బాక్స్ ఆఫీస్ ను ఈ చిత్రంతో బంతాట ఆడేస్తాడా లేదా ఓ లుక్కేద్దాం పదండి..


చిత్రం : భగవంత్ కేసరి

నటీనటులు : నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, అర్జున్ రాంపాల్ 


నిర్మాత : సాహు గారపాటి, హరీష్ పెద్ది

దర్శకత్వం : అనిల్ రావిపూడి

సంగీతం : ఎస్ తమన్

విడుదల తేదీ : అక్టోబర్ 19, 2023

కథ :

భగవంత్ కేసరి (నందమూరి బాలకృష్ణ) అదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక సామాన్యమైన వ్యక్తి. అతను తన కూతురు అయిన విజ్జిని ఒక గొప్ప మిలటరీ ఆఫీసర్ చేయాలి అని తపన పడుతూ ఉంటాడు. అయితే నిజానికి విజ్జి అతని కూతురు కాదు..భగవంత్ ఒకప్పుడు జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు అక్కడి జైలర్ కూతురే విజ్జి ( శ్రీ లీల). అనుకోని కొన్ని కారణాలవల్ల భగవంత్ ఆమె బాధ్యతలు తీసుకొని గార్డియన్ గా మారుతాడు.

మానసిక వైద్యురాలు అయిన కాత్యాయని ( కాజల్ అగర్వాల్) కి భగవంత్ కేసరి పరిచయం ఏర్పడుతుంది. మామూలుగా సాగుతున్న వాళ్ల జీవితంలోకి సంఘ్వీ (అర్జున్ రాంపాల్) అనే ఒక వ్యాపారవేత్త ఎంట్రీ ఇవ్వడంతో అసలు ట్విస్ట్ మొదలవుతుంది.సంఘ్వీ ఒక పెద్ద పొలిటీషియన్ కొడుకు కూడా. అందుకే ప్రపంచంలోనే అందరికంటే గొప్ప వ్యక్తిగా మారాలని, ప్రతిదీ తన కంట్రోల్ లో ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు.

విజ్జిని ధైర్యవంతురాలుగా మార్చడమే కాకుండా ఆర్మీలో జాయిన్ చేయాలి అని భగవంత్ కేసరి అనుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలో అనుకోకుండా సంఘ్వీకి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మధ్య జరిగిన ఒక గొడవలో విజ్జి ఇరుక్కుంటుంది. తన ప్రమేయం లేకుండా విజ్జి గొడవలో ఎలా ఇరుక్కుంది? కూతురు ప్రాణాల మీదకు వచ్చినప్పుడు భగవంత్ కేసరి ఏమి చేశాడు?సంఘ్వీకి ,భగవంత్ కి మధ్య అసలు గొడవ ఏమిటి?భగవంత్ ఫ్లాష్ బ్యాక్ లో ఏం చేసేవాడు? ఇవన్నీ తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఆరుపదుల వయసు దాటుతున్న ఇప్పటికి కూడా కుర్ర హీరోలతో సమానంగా యంగ్ హీరోయిన్స్ తో స్టెప్పులు వేసే బాలయ్యను చూశాం. అయితే ఈ మూవీ లవ్ మొదటిసారి తన వయసుకు తగిన పాత్రలో బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించాడు. అఖండ మూవీ తర్వాత నుంచి కమర్షియల్ గా వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య ఈ చిత్రంతో కచ్చితంగా హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తాడు అనిపిస్తుంది.

అనగనగా ఒక హీరో, ఎంతో గారాబంగా పెంచుకొని అతని కూతురు, సాఫీగా సాగే వీళ్ళ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన ఒక విలన్. ఇక కూతుర్ని కాపాడుకోవడానికి తన అసలు రూపం బయటపెట్టిన తండ్రి. కట్ చేస్తే హీరోకి భయంకరమైన ఒక ఫ్లాష్ బ్యాక్, అంత పెద్ద విలన్ సామ్రాజ్యాన్ని కూతురి కోసం నాశనం చేసే పవర్ఫుల్ హీరో. కథ రొటీన్ గా ఉంది కదా.. కానీ బాలయ్య ఈ మూవీ ని చేయడం వల్లో లేక కథనం ఆసక్తిగా ఉండడం వల్ల తెలియదు కానీ మూవీ మాత్రం పెద్ద బోర్ కొట్టదు.

ఈ చిత్రంలో శ్రీలీల బాలయ్యతో పోటీపడి నటించింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ మనసు హత్తుకునే విధంగా ఉన్నాయి. ఈ మూవీలో కచ్చితంగా మనం ఒకసారి కొత్త బాలయ్యను చూస్తాం. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో బాలయ్య ఒక మెసేజ్ కన్వే చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ కాన్సెప్ట్ మరియు బాలయ్య పర్ఫామెన్స్ చాలా అద్భుతంగా సెట్ అయ్యాయి.

ప్లస్ పాయింట్స్ :

+ బాలయ్య, శ్రీ లీల నటన

+ బాలకృష్ణ డైలాగ్స్

+ సెకండాఫ్

+ విలన్ క్యారెక్టర్

+ ఉమెన్ ఎంపవర్ మెంట్ కాన్సెప్ట్

మైనస్ పాయింట్స్:

– రొటీన్ స్టోరీ

– సాగదీతగా అనిపించే సీన్స్

– అనవసరమైన లవ్ ట్రాక్

– మెప్పించని కామెడీ

కంక్లూజన్ :

దసరాకి కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి సినిమా.. భగవంత్ కేసరి

Related News

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Big Stories

×