Bhagavanth Kesari: ఒక్క మలయాళం ఇండస్ట్రీ తప్ప మిగిలిన ప్రతి సినీ ఇండస్ట్రీలో 6 పదులు వయసు దాటుతున్న స్టార్ హీరోలు ఇంకా కుర్ర క్యారెక్టర్లే చేస్తున్నారు. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో తాను సినిమాలో నటించినంత కాలం హీరో పాత్ర తప్ప వేరే పాత్ర చేయాలి అంటే కాస్త వెరైటీగా ఫీల్ అవుతారు. వయసుకు తగ్గ క్యారెక్టర్స్ కాస్త నాచురల్ గా ఉండే కథలు చేసే హీరోలు తెలుగులో మరీ అరుదనే చెప్పవచ్చు. తెలుగు హీరో అంటే కచ్చితంగా కమర్షియల్ సాలిడ్ కథ పడాల్సిందే.. పైగా హీరోని సెంటర్ లో పెట్టి ఫుల్లుగా ఎలివేట్ చేయాలి. లేకపోతే హీరో బాబు ఫీలవుతాడు కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా హీరోయిన్తో రొమాన్స్ కూడా పెట్టాల్సిందే.
కానీ ఈ ట్రెండ్ మారుతోంది..స్టార్ హీరోలు కాస్త తమ వయసుకు తగిన పాత్రలు చేయడానికి ప్రాముఖ్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. పెద్ద తరహా పాత్రలు చేయడమే కాకుండా తమ వయసుకు తగిన స్టోరీస్ ఎంచుకొని కనువిందు చేసే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు మన ఏజ్ బార్ స్టార్ హీరోలు. ఆల్రెడీ కమలహాసన్ ,రజనీకాంత్ ఈ ట్రెండ్ ని ఆల్రెడీ మొదలు పెట్టేశారు.. ఇప్పుడు బాలయ్య కూడా అదే రూట్ను ఫాలో అవుతున్నాడు. మొన్న వచ్చిన విరసింహారెడ్డిలో ఆల్రెడీ ఒక వంతు తండ్రి పాత్ర పోషించి మెప్పించాడు. అయితే శృతిహాసన్ తో కలిసి స్టెప్పులేసి కాస్త విమర్శకు గురయ్యాడు అనుకోండి.
అయితే ఈసారి అక్టోబర్ 19న దసరా స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భగవంత్ కేసరి లో మాత్రం తన ఏజ్ కి తగ్గ పాత్రను బాగా హ్యాండిల్ చేశాడు బాలయ్య. అనిల్ రావిపూడి ఈ స్టొరీ ని బాలయ్య స్టైల్లో తెరకెక్కించడంలో సక్సెస్ సాధించాడు. బాలయ్య ఫ్యాన్స్ కు ఎటువంటి ఎలివేషన్స్ కావాలో ఈ మూవీలో ఉన్నాయి. మరి ముఖ్యంగా బాలయ్యకు శ్రీ లీలకు మధ్య చూపించిన ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఈ సినిమాలో హైలెట్గా నిలిచింది. ఇక బాలయ్య మాస్ డైలాగ్స్ ఐతే మూవీని ఓ రేంజ్ కి తీసుకెళ్లాయి.
మంచి ఎమోషనల్ బాండింగ్ ని అంతకంటే మంచి స్క్రీన్ ప్లే తో డిస్ప్లే చేయడంతో మూవీ జనంలోకి బాగా చొచ్చుకొని వెళ్ళింది. ఈ మూవీ చూసిన ఎవరికైనా అనిల్ మంచి సాలిడ్ కథను ప్రిపేర్ చేసి ఫైనల్ ఫినిషింగ్ టచ్ గా అంతకంటే బ్రహ్మాండమైన మెసేజ్ ని ఇచ్చాడు అని అర్థం అవుతుంది. కమర్షియల్ గా స్టోరీ పై ఎక్కువ ఫోకస్ పెట్టి అనవసరమైన హంగామా చేయకుండా స్టోరీని చాలా నేచురల్ గా ముందుకు తీసుకువెళ్లారు. ఇందులో హీరోయిన్ పేరు మాత్రమే కాజల్ కానీ నిజానికి మెయిన్ క్యారెక్టర్ శ్రీ లీల. అయినా శ్రీ లీలను అవసరానికి మించి గ్లామరస్ గా చూపించలేదు.
కథకు తగినట్టు మాత్రమే శ్రీ లీల ను హైలైట్ చేశారు .. సినిమా మొత్తం ఆమె పాత్రకు తగినట్లు డీ గ్లామర్ రోల్ లోనే కనిపించింది. ఎక్కడ అవసరానికి మించి ఒక్క పాట కూడా అతిగా పెట్టలేదు. అయితే సినిమా రిలీజ్ కి ముందు బాలకృష్ణ నటించిన మంగమ్మగారి మనవడు చిత్రంలోని ఫేమస్ పాట దంచవే మేనత్త కూతురా సాంగ్ ఈ చిత్రంలో ఉంటుంది అని జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీన్ని స్టోరీలో పెట్టడం వల్ల ఆడియన్స్ డైవర్ట్ అవుతారు అనే ఉద్దేశంతో షూటింగ్ చేసినా కూడా పాటను ఇందులో పెట్టలేదు.
ఇక మూవీలో తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా మూవీ ని ఎలివేట్ చేసింది. సాంగ్స్ విషయంలో తమన్ కాస్త నిరాశపరిచాడు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ తో బ్యాలెన్స్ చేశాడు. డైలాగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటూ కథకు అనుగుణంగా ఎంతో పకడ్బందీగా ప్రతి ఒక్క సీన్ డిజైన్ చేసి సినిమాను చాలా అద్భుతంగా తీశారు. ఈ దసరాకు వచ్చిన బాలయ్య మూవీ ఇప్పటివరకు ఉన్న బాలయ్య ట్రేడ్ మార్క్ కి భిన్నంగా సందేశాత్మకమైన చిత్రంగా తెరకెక్కడమే కాకుండా ప్రేక్షకుల మనసును మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.