Bhagavanth Kesari Vs Leo: దసరా పండుగ కంటే కూడా ఇది మూవీ లవర్స్ పండుగ అనడం కరెక్ట్ గా ఉంటుంది. అగ్ర హీరోలు తమ మూవీస్ తో అభిమానులకు విందు భోజనాలు వడ్డిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా మార్కెట్లో తలపడుతున్న చిత్రాలు మూడు. అయితే అక్టోబర్ 19న వీటిలో రెండు సినిమాలు పోటాపోటీగా విడుదలయ్యాయి. ఒకటి లియో రెండోది భగవంత్ కేసరి. కలెక్షన్స్ పరంగా నువ్వా నేనా అన్నట్టు ఉన్న ఈ రెండు చిత్రాల్లో ఈ కామన్ పాయింట్స్ ను మీరు గమనించారా.
రెండిట్లో ఏంటి కామన్ ?
ఒకటి తమిళ్ డబ్బింగ్ ,రెండోది తెలుగు స్ట్రైట్ ఫిలిం.. మరి ఏంటి రెండిట్లో కామన్ అని ఆలోచిస్తున్నారా.. అదిగో ఆ పాయింట్ కే వస్తున్నా ఆగండి మరి. రెండు మూవీ టైటిల్స్ గమనించారా.. విజయ్ నటించిన మూవీ లియో అంటే సింహం. మరి బాలయ్య మూవీ భగవంత్ కేసరి.. కేసరి అంటే తినే కేసరి కాదండోయ్.. అది కూడా సింహమే. టైటిల్స్ రెండు చూసారా ఎంత కామన్ గా ఉన్నాయో. ఓసింతేనా టైటిల్స్ ఒకటే కదా కామన్ అనుకుంటున్నారా.. కథ ఇంకా చాలా ఉంది. పదండి ఈ రెండు మూవీస్ మధ్య ఉన్న కామన్ పాయింట్స్ ఏందో చూసేద్దాం..
నందమూరి బాలకృష్ణ పూర్తిగా తన వయసుకు తగిన పాత్రలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో నటించిన చిత్రం భగవంత్ కేసరి.. ఈ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకి అక్టోబర్ 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుంది. ఇందులో బ్యాక్ టు బ్యాక్ మాస్ డైలాగ్స్ ,బాలయ్య ఫైట్ సీన్స్ ఎక్స్ట్రార్డినరీ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటించారు.ఇక ఈ మూవీకి తమన్ సంగీతం అందించడం జరిగింది.షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి, హరీష్ పెద్ధి ఈ ప్రతిష్టాత్మికమైన మూవీని నిర్మించారు.
మరి లియో విషయానికి వస్తే ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ మూవీకి లోకేష్ కనకరాజ్ దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఇక ఈ సినిమాలో అర్జున్ సర్జాతో ,సంజయ్ దత్, మడోన్నా సెబాస్టియన్, ప్రియా ఆనంద్, గౌతం మీనన్ తదితరులు కీలకమైన పాత్రలు పోషించారు. ఈ మూవీకి మ్యూజిక్ అనిరుద్ రవిచంద్రన్ అందించాడు.
రెండు చిత్రాలు విడుదలకు ముందు నుంచి భారీ హైప్ సృష్టించాయి. విడుదల తర్వాత కూడా మంచి కలెక్షన్స్ తో ఢీ అంటే ఢీ అనేట్టు పోటీ పడుతున్నాయి. ఇక ఈ రెండిటి మధ్య కామన్ పాయింట్ విషయానికి వస్తే.. రెండు మూవీస్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ మెయిన్ పాయింట్. తమ ఫ్యామిలీ కోసం హీరో ఎంత వరకైనా, ఏం చేయడానికైనా సిద్ధం. భగవంత్ కేసరి సినిమాలో విలన్ తన బిజినెస్ కాపాడుకోవడానికి కన్న కొడుకుని కూడా కనికరం లేకుండా చంపేస్తాడు. ఇక లియో లో కూడా ఇంచుమించు ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఇందులో కూడా విలన్ ఇంచుమించు ఇదే రకంగా తన కొడుకుని చంపుతాడు .కాకపోతే కొడుకు తప్పించుకుని బతికి పోతాడు.
హీరోలు ఇద్దరు తమ ఫ్లాష్ బ్యాక్ ని దాచి పెట్టి ప్రజెంట్ ఎంతో ప్రశాంతంగా బతుకుతుంటారు. అయితే కుటుంబం మీద ఒక ఆపద వచ్చింది అని తెలిసిన మరసటి నిమిషం వాళ్లలో అప్పటివరకు దాగి ఉన్న బడబాగ్ని బయటకి వస్తుంది. కామన్ మ్యాన్ కాంప్లికేటెడ్ మాన్ గా మారిపోతాడు. ఎదురుగా వస్తున్న వందల మంది విలన్ మనుషులను ఒంటి చేత్తో చితకబాదుతాడు. ఇలా ఈ రెండు మూవీలు జాగ్రత్తగా గమనిస్తే చాలావరకు ఒకదానితో ఒకటి బాగా సెట్ అవుతాయి. ఈ విషయం అందరికంటే ముందు గమనించిన మన నెటిజన్స్ సోషల్ మీడియాలో ఈ రెండు మూవీస్ ని కంపేర్ చేసి తెగ పోస్టులు పెడుతున్నారు.