BigTV English

Bhairava Anthem: ఆకట్టుకుంటున్న భైరవ ఆంథమ్.. స్టైలిష్ లుక్ ప్రభాస్ అదుర్స్

Bhairava Anthem: ఆకట్టుకుంటున్న భైరవ ఆంథమ్.. స్టైలిష్ లుక్ ప్రభాస్ అదుర్స్

Bhairava Anthem: ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్.. నిన్న భైరవ ఆంథమ్ ను రిలీజ్ చేస్తామని తెలిపారు కానీ, కొన్ని కారణాల వలన వాయిదా వేసి ఈరోజు రిలీజ్ చేశారు. పంజాబీ సింగర్ దల్జీత్ దోసాంజ్ తో కలిసి ప్రభాస్ కనిపించాడు. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ భైరవ క్యారెక్టర్ ను పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి.

నాకు నేనే.. నాతో నేనే.. మనసు ఉన్నా దాన్ని వాడను. మైండ్ మాటనే వింటాను. ఒక్క నేనే.. వేల సైన్యమయ్యా లాంటి లైన్స్ కేవలం భైరవనే కాదు ప్రభాస్ క్యారెక్టర్ ను కూడా ఎలివేట్ చేస్తున్నాయి. వీడియోలో భైరవ- బుజ్జి తో కలిసి చేసిన సాహసాలను చూపించారు. పంజాబీ స్టైల్లో దల్జీత్ దోసాంజ్ పాడిన లిరిక్స్ కూడా ఆకట్టుకున్నాయి.


ముఖ్యంగా ప్రభాస్ లుక్స్.. బ్లాక్ అండ్ బ్లాక్ లో డార్లింగ్ లుక్ అదిరిపోయింది. చాలా రోజుల తరువాత ప్రభాస్ ఇంత స్టైలిష్ గా కనిపించాడు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. మొత్తానికి ఇది చార్ట్ బస్టర్ సాంగ్ గా మారుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమాతో కల్కి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Big Stories

×