BigTV English

Monsoon Hair Care: వర్షాకాలంలో వచ్చే చుండ్రు నివారణకు నేచురల్ రెమెడీస్ !

Monsoon Hair Care: వర్షాకాలంలో వచ్చే చుండ్రు నివారణకు నేచురల్ రెమెడీస్ !

Monsoon Hair Care: వర్షాకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ఎదుర్కునే సమస్యల్లో చుండ్రు సమస్య ఒకటి. నేటి యువత తరచుగా జుట్టుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సీజన్లో చర్మం, జుట్టు సమస్యలు వస్తాయి. కానీ వర్షాకాలంలో మాత్రం స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌లు బాగా పెరుగుతాయి. దీంతో చాలా మంది జుట్టు రాలడంతో పాటు తీవ్రమైన చుండ్రు సమస్యను ఎదుర్కుంటారు.


చుండ్రు జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడానికి కూడా కారణమవుతుంది. వర్షాకాలంలో మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సాధారణ హెయిర్ టిఫ్స్ ఫాలో అవ్వండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మరసం:
నిమ్మరసానికి శుభ్రపరిచే లక్షణాలు ఉంటాయి. ఇది చుండ్రు రాలడాన్ని తగ్గిస్తుంది. స్కాల్ప్‌ను తాజాగా ఉంచుతుంది. తలకు నేరుగా నిమ్మరసాన్ని పట్టించకుండా ఏదైనా ఆయిల్‌లో కలిపి వాడాలి. చుండ్రు సమస్య నిమ్మరసంతో తగ్గించుకోవచ్చు.
కొబ్బరి నూనె, కర్పూరం:
కొబ్బరి నూనె సహజం మాయిశ్చరైజర్. కొబ్బరి నూనెలో కర్పూరం మిక్స్ చేసి వాడటం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. కొబ్బరి నూనె, కర్పూరం మిశ్రమాన్ని తలకు పట్టించి రాత్రంతా వదిలేయండి. ఉదయం తలస్నానం చేయండి. ఇది చుండ్రును నియంత్రించడంతో పాటు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
మెంతులు:
మెంతి గింజల్లో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. చుండ్రును సమర్థవంతంగా తగ్గించడంలో మెంతులు సహాయపడుతాయి.

Also Read: టీ లేదా కాఫీ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?


కలబంద:
కలబంద చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. తాజా కలబంద జెల్‌ను నేరుగా తలకు అప్లై చేసి అరగంట పాటు ఉంచాలి. ఆ తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. చుండ్రు సమస్యను దూరం చేయడంతో పాటు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

Tags

Related News

Bad Breakfasts: బ్రేక్ ఫాస్ట్‌లో ఇలాంటివి తిన్నారంటే గుండె పోటు ప్రమాదం పెరిగిపోతుంది అంటున్న డాక్టర్లు

Silky Hair tips: జుట్టుకు షాంపూ పెట్టాక ఈ ఒక్క వస్తువుతో మీ వెంట్రుకలను శుభ్రం చేసుకోండి చాలు, సిల్కీగా మారిపోతాయి

Sweet Corn Kebab: వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుందా? స్వీట్ కార్న్‌తో కబాబ్ చేయండి అదిరిపోతుంది

Millets: మిల్లెట్స్ తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి

Home remedies: రాత్రి దిండు కింద పెట్టే సింపుల్ హోమ్ రెమిడీ.. ఇలా చేస్తే..

Onion juice: జుట్టుకు ఉల్లిపాయ రసం రాస్తున్నారా? వీటిని కలిపితే..

Big Stories

×