Brahmamudi serial today Episode: జనాభా లెక్కలు రాసుకోవడానికి అంటూ వచ్చిన యామిని మనిషి వెళ్లిపోతుంటే అప్పుడే వెళ్లిపోతారేంటి ఆఫీసర్ ఇక్కడ ఒకరి గురించి రాసుకోలేదు అంటూ ఈవిడ పేరు కావ్య రాసుకోండి అంటుంది. పేరు రాసుకున్న అతను ఈవిడ ఈ ఇంటికి ఏమవుతారు అని అడుగుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ విషయం మా వదిన చెప్తుంది అని రుద్రాణి చెప్పగానే.. ఏం చెప్పాలో అర్థం కాక అపర్ణ చూస్తుంది. ఇంతలో రాజ్ ఏంటి ఆఫీసర్ అంతలా అడుగుతారు. ఆవిడ వారికి మేనకోడలు అవుతుంది. ఏంటమ్మా అంతేగా అంటాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకుంటారు. అపర్ణ నవ్వుతూ అవును అంటుంది. ఇంత క్లియర్ గా నిజాలు బయట పెట్టినా తెలుసకోలేకపోతున్నావేంట్రా ఇంత తింగరిగా తయారయ్యావు అని మనసులో అనుకుంటుంది రుద్రాణి.
ఇంద్రాదేవి సంతోషంగా కరెక్టుగా చెప్పావు మనవడా.. మేనకోడలే అంటుంది. మరి మేనకోడలే అయితే వారి అమ్మా నాన్నా ఎక్కడున్నారు అని ఆ వ్యక్తి అడుగుతాడు. దీంతో మళ్లీ అందరూ షాక్ అవుతారు. ఇంద్రాదేవి వాళ్లు వాళ్ల ఇంట్లో ఉన్నారన్నమాట.. చిన్నప్పటి నుంచి మా అపర్ణ పెంచుకోవడంతో ఇక్కడే ఉంటుంది అని చెప్తుంది. సరేనని ఆ వ్యక్తి వెళ్లిపోతాడు. ఇంద్రాదేవి కోపంగా అమ్మా రుద్రాణి ఇటు రా అమ్మా నీతో చిన్న పని ఉంది. అంటూ పిలవగానే.. అమ్మా నాకు చిన్న పని ఉంది అంటూ ఎస్కేప్ అవ్వబోతుంటే.. స్వప్న, రాహుల్ అత్తా నీ పని మేము చేస్తాము నువ్వు వెళ్లు అని చెప్పగానే.. ఇంద్రాదేవి, రుద్రాణిని గదిలోకి తీసుకు వెళ్లి కొడుతుంది.
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న రాజ్ ప్రేమగా కావ్యను ఒక కప్పు కాఫీ అడగుతాడు ఇవ్వనని కావ్య వెళ్లిపోతుంది. ఇంతలో అక్కడకు అపర్ణ, ఇంద్రాదేవి వస్తారు. ఓరేయ్ మనవడా ఎందుకు వచ్చిన కర్మరా ఇది ఒక కాఫీ కోసం ఇంతలా అడుక్కోవాలా అంటుంది ఇంద్రాదేవి. అడుక్కుంటున్నానని మీరంటున్నారు.. రొమాంటిక్‌గా ట్రై చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. ఇదిగో మీ కళావతి పైకి కోపం చూపిస్తుంది కానీ లోపల నా మీద ప్రేమ ఉందని నా నమ్మకం అంటాడు. నమ్మకం ఉంటే వెంటనే వెళ్లి ప్రపోజ్ చేయోచ్చు కదా అని అపర్ణ చెప్తుంది. ప్రపోజా అప్పుడేనా..? అంటూ రాజ్ అడగ్గానే.. ఒరేయ్ మనవడా నువ్వు కోమాలోకి వెళ్లి గతం మర్చిపోవడం వల్ల నువ్వు నీ వయసు సంగతి మర్చిపోతున్నావు.. ఇప్పటికే బాగా ఆలస్యం అయింది అంటుంది ఇంద్రాదేవి.
దీంతో రాజ్ అయినా నాన్నమ్మ తొందర పడితే మొదటికే మోసం వస్తుంది అంటాడు. అయితే ఆలస్యం చేస్తే యామినికి సమాధానం చెప్పాల్సి వస్తుంది అని అపర్ణ చెప్పగానే.. అది కూడా నిజమే ఇప్పుడు ఏం చేయమంటారు అని రాజ్ అడుగుతాడు. దీంతో ఇంద్రాదేవి వెంటనే వెళ్లి నీ మనసులో ప్రేమను కళావతి ముందు పెట్టు.. తనని పెళ్లికి ఒప్పించు.. అని చెప్తుంది. దీంతో రాజ్ ఇప్పుడే కదా కోపం పోగొట్టాను.. అప్పుడే ప్రేమ పెళ్లి అంటే ఎలా రియాక్ట్ అవుతుందో అంటాడు. మరి ఎప్పుడు చెప్తావు అని ఇంద్రాదేవి అడగ్గానే.. రేపు చెప్తాను శుక్రవారం.. పైగా అమ్మవారి ఆశీర్వాదం కూడా ఉంటుంది అంటాడు రాజ్. అవును అత్తయ్యా వీడు చెప్పేది కూడా నిజమే రేపు ఉదయం పదకొండు గంటల నుంచి మంచి ముహూర్తం ఉంది అంటుంది అపర్ణం.
అయితే ఇంకేంటి ఒక ఐదుగురు ముత్తయిదువులను కూడా పిలిపించండి అంటూ వెటకారంగా చెప్తుంది ఇంద్రాదేవి. లేకపోతే ఏంటి ముందు ప్రపోజ్ చేయరా అంటే ముహూర్తాలు.. గంటలు అంటూ లెక్క పెడతారేంటి..? అంటుంది. దీంతో ఈరోజు రాత్రికి పుల్లుగా ప్రిపేర్ అవుతాను..రేపు వచ్చి కచ్చితంగా ప్రపోజ్ చేస్తాను అంటూ రాజ్ వెళ్లిపోతాడు. దూరం నుంచి రాహుల్ అంతా గమనిస్తుంటాడు. పెద్ద ప్లానే వేశారు. వెంటనే ఈ విషయం మమ్మీకి చెప్పాలి అని రుద్రాణి దగ్గరకు కంగారుగా మామ్ మామ్ అంటూ పరుగెత్తుకు వెళ్తాడు. అపర్ణ, ఇంద్రాదేవి వేసిన ప్లాన్ గురించి చెప్తాడు. వెంటనే రుద్రాణి యామినికి ఫోన్ చేస్తుంది. ఇంట్లో జరుగుతున్న విషయాలు చెప్పి రేపు వాడు ఇంట్లో అడుగుపెట్టడానికి వీలులేదు అని చెప్తుంది. మరోవైపు అపర్ణ, ఇంద్రాదేవి కావ్య దగ్గరకు వెళ్లి రేపు రాజ్ వచ్చి ప్రపోజ్ చేస్తే నువ్వు కూడా ఓకే చెప్పాలని ఒప్పిస్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?