OTT Movies : ఓటీటీలో డిఫరెంట్ స్టోరీ తో కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఓటీటీలో ఎలాంటి సినిమా రిలీజ్ అవుతున్న ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాయి. హారర్ సినిమాలకు డిమాండ్ ఎక్కువే. ఒక్కో మూవీ ఒక్కో స్టోరీతో రావడం తో ఎక్కువ మంది సినిమా ఇలాంటి సినిమాలను మిస్ చెయ్యకుండా చూస్తున్నారు. తాజాగా మరో భయంకరమైన హారర్ మూవీ వచ్చేసింది. ఈ సినిమాను చూస్తూనే కొందరు చనిపోయారు అంటే స్టోరీ దారుణంగా ఉందని తెలుస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు ఈ మూవీ స్టోరీ ఏంటో? సినిమా పేరేంటో ఒకసారి చూసేద్దాం..
స్టోరీ విషయానికొస్తే..
ఒకప్పుడు రామ్ గోపాల్ లాంటి స్టార్ డైరెక్టర్లు మా సినిమాలను దమ్ముంటే ఒంటరిగా చూడండి అంటూ సవాలు విసిరేవాళ్లు. ఎందుకంటే అప్పుడు వాళ్లు హారర్ సినిమాలను తెరకెక్కించే వాళ్లు. అంతకు మించి స్టోరీలతో ఈ మధ్య వెన్నులో వణుకు పుట్టించే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ఓ హారర్ మూవీని చూస్తూ దాదాపు 86 మంది భయం తో చనిపోయారట. ఒక ప్రమాదకరమైన అని, దీనిని చూసిన వారికి ప్రమాదకరమైన పరిణామాలు ఎదురవుతాయని అప్పట్లో అందరూ భయపడ్డారు. అయితే గుర్తింపు కోసమే ఇలా ప్రచారం చేశారని టాక్. ఇందులో నిజమేంత ఉందో తెలియదు.. అంత భయంకరమైన మూవీ మరేదో కాదు.. ‘అంట్రమ్: ది డెడ్లీయెస్ట్ ఫిల్మ్ ఎవర్ మేడ్’..
ఈ మూవీలో మ్యాక్సిన్ అనే మహిళకి ఒరలి, నాథన్ అనే ఇద్దరు పిల్లలు ఉంటారు. వీళ్లు ఎంతో ఇష్టంగా పెంచుకొనే కుక్కపిల్ల చనిపోతుంది. అది చనిపోవడం తో ఇంట్లో తీవ్ర విషాదం ఏర్పడుతుంది. అది నరకానికి వెళ్లిందని నాథన్ తో అతని తల్లి ఆటపట్టించడానికి చెబుతుంది. దీంతో నాథన్ నొచ్చుకుంటాడు. అక్క తన సోదరుడిని బుజ్జగించేందుకు ఒరలీ తన తమ్ముడిని అడవిలోని ‘అంట్రమ్’ అనే ప్రాంతానికి తీసుకెళుతుంది. అక్కడ పెంపుడు కుక్క ఆత్మకు శాంతి కలగజేసేందుకు, నరకానికి ఒక గొయ్యి తవ్వాలనుకుంటారు.. అక్కడ గుంత తవ్వే కొద్ది భయంకరమైన ఆకారాలు బయటకు వచ్చి పిల్లలను భయపెడతాయి. అవి భయంకరమైన దుష్ట శక్తులు.. వాటి నుంచి వీరిద్దరు ఎలా తప్పించుకున్నారు..? వీళ్లు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొన్నారు అనేది సినిమా స్టోరీ.. ఈ స్టోరీని చదవడం కన్నా ఒక్కసారి చూస్తేనే అర్థమవుతుంది. అస్సలు మిస్ అవ్వకుండా ఓటీటీలో చూసేయ్యండి…
Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. మాస్ ఆడియన్స్ ఫుల్ కిక్కే..
అమెజాన్ ప్రైమ్ వీడియో ( Amazon Prime Video)..
ఈ కెనడియన్ మూవీ అంట్రమ్: ది డెడ్లీయెస్ట్ ఫిల్మ్ ఎవర్ మేడ్’.. డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. 2018 లో వచ్చిన ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదలైంది. ఈ మూవీకి డేవిడ్ అమిటో, మైఖేల్ లైసిని దర్శకత్వం వహించారు.. ఈ మూవీని ధైర్యం ఉన్న వాళ్లు మాత్రమే చూడండి. లేదంటే ఒంటరిగా మాత్రం చూడకండి..