HBD Prashanth Neel:ప్రముఖ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈయన అసలు పేరు ప్రశాంత్ నీల్ సోమాదుల. ‘ఉగ్రమ్’, ‘శ్రీమురళిని’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ కన్నడ సీరియల్ యాక్టర్ యష్ (Yash ) హీరోగా ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాలకు దర్శకత్వం వహించి, పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలతో ఊహించని కలెక్షన్లు రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు ప్రశాంత్ నీల్. ప్రభాస్(Prabhas ) తో ‘సలార్’ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ (NTR)తో ‘డ్రాగన్’ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు.
ఎన్టీఆర్ సమక్షంలో ప్రశాంత్ పుట్టినరోజు వేడుకలు..
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈరోజు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సమక్షంలో ఆయన పుట్టిన రోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. నిన్న అర్ధరాత్రి ఐపీఎల్ ముగిసిన తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో పాటు చిత్ర బృందం సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అటు RCB విన్నింగ్ తో సంతోషంలో మునిగిపోయిన ప్రశాంత్ నీల్ ఇటు ఎన్టీఆర్ సమక్షంలో కేక్ కట్ చేయడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాదు ఈ బర్తడే చాలా స్పెషల్ అని కూడా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సెలబ్రేషన్స్లో హైలెట్ ఏంటంటే.. ప్రశాంత్ నీల్ కేక్ కట్ చేయగానే తన మొదటి కేకు ఎన్టీఆర్ కి తినిపించారు. ఇక ఆయన ఆప్యాయతతో ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.
Also read: Rashmika Mandanna: పుష్ప మూడ్ నుండి బయటపడలేకపోతున్న రష్మిక.. ట్రెండ్ మారుతోంది మేడమ్!
ప్రశాంత్ నీల్ కెరియర్..
ప్రశాంత్ నీల్ కెరియర్ విషయానికి వస్తే .. మొదట్లో ఫిలిం మేకింగ్ లో చేరిన ఈయన.. ఉగ్రమ్ అనే యాక్షన్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కన్నడలోనే కెరియర్ మొదలుపెట్టి టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈయన 2014 లో అత్యధిక కలెక్షన్స్ వసూల్ చేసిన కన్నడ చిత్రాలలో ఒకటిగా కే జి ఎఫ్ నిలిచింది. ఇక త్వరలో కేజిఎఫ్ చాప్టర్ 3 సినిమాతో పాటు సలార్ 2 సినిమాలను కూడా లైన్ లో పెట్టారు ప్రశాంత్ నీల్. దీన్ని బట్టి చూస్తే మరో నాలుగు ఏళ్ళు ప్రశాంత్ ఖాళీగా ఉండరు అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఈయన చేసింది తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలతో అవార్డులు అందుకున్నారు. ఉగ్రం సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ తో పాటు సైమాకూడా అందుకున్న ఈయన కే జి ఎఫ్ చాఫ్టర్ – 1 సినిమాకి సిటీ, సినీ అవార్డు, జీ కన్నడ అవార్డు, సైమా అవార్డు , ఫిలిం అవార్డు కూడా అందుకున్నారు.
Prashant Neel birthday celebration 🥳@tarak9999 anna #prashantneel pic.twitter.com/ylQPvL7YFq
— Somu Yadav (@taraksomu9999) June 4, 2025