Madhubala: మధుబాల.. 90’స్ యువతకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘రోజా’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషలలో పలు చిత్రాలు చేసి పాన్ ఇండియా నటిగా పేరు సొంతం చేసుకుంది. గత ఏడాది ‘గేమ్ ఇన్’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇప్పుడు మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న కన్నప్ప (Kannappa ) సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ సినిమాను ‘మహాభారతం’ సీరియల్ తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh kumar singh)దర్శకత్వం వహించారు.
జూన్ 27వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో.. నిన్న కేరళలోని కొచ్చిలో కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. ట్రైలర్ కి ఒక వర్గం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా.. ఒక వర్గం మాత్రం ఎప్పటిలాగే నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ముఖ్యంగా పాత్రలు పేలవంగా ఉన్నాయని, సీరియల్ చూసిన అనుభవం కలుగుతోంది అంటూ చాలామంది పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
ఆ డైరెక్టర్ నన్ను ఇబ్బంది పెట్టాడు – మధుబాల
ఇకపోతే తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన మధుబాల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, ఊహించని కామెంట్లు చేసింది. “ఇంటిమేట్ సీన్స్ లో నటించడం నచ్చదు.. అందుకే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ కారణంగానే ఎన్నో అవకాశాలు కోల్పోయాను. గ్లామరస్ పాత్రలు, రొమాంటిక్ సన్నివేశాలలో నటించకూడదని ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడే డిసైడ్ అయ్యాను. కానీ ఒక సినిమా సమయంలో ఆ రూల్ బ్రేక్ చేయాల్సి వచ్చింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ కిస్ సీన్ చేయమని చెప్పాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. నేను అసలు చేయనని చెప్పాను. కానీ కొంతమంది నా దగ్గరకు వచ్చి ఆ సీన్ సినిమాకి ఎంతో ముఖ్యమని చెప్పడంతో నటించక తప్పలేదు. ఆ తర్వాత ఎంతో బాధపడ్డాను. అసలు నేనేనా ఇలా చేసింది అనుకున్నాను. అయితే సినిమా రిలీజ్ సమయానికి ఏదోలాగా ఆ సీన్ తొలగించారు.
అయినా సరే నేను కష్టపడి చేశాను. ఎందుకు తొలగించారని డైరెక్టర్ తో గొడవ పెట్టుకోలేదు. ఎందుకంటే అలాంటి సీన్స్ చేయడం నాకు నచ్చదు. దానిని మళ్లీ తెరపై చూపించడాన్ని అసలు తట్టుకోలేను అంటూ ఇండస్ట్రీలో తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది” మధుబాల. ఇకపోతే సన్నివేశం డిమాండ్ చేస్తే మూవీ కోసం ఒక నటి ఏమైనా చేయాల్సిందేనని ఆ తర్వాతే అర్థమైంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మధుబాల షేర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఆ డైరెక్టర్ ఎవరు? ఆ సినిమా ఏంటి ? అనే విషయాలు మాత్రం ఆమె రివీల్ చేయలేదు.
మధుబాల కెరియర్..
మధుబాల కెరియర్ విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. మధుబాల ఎవరో కాదు ప్రముఖ హిందీ నటి హేమమాలిని (Hema Malini) కి స్వయాన మేనకోడలు. ఈమె తండ్రి టి రఘునాథ్ చలనచిత్ర నిర్మాత.. తల్లి పేరు రేణుక..తల్లి వద్ద భరతనాట్యం నేర్చుకుంది..తల్లి క్యాన్సర్ వ్యాధితో మధుబాల 13 ఏళ్ల వయసులోనే స్వర్గస్తులయ్యారు. ఇక దీనితో ఈమె బాధ్యతను ఈమె మేనత్త హేమమాలిని తీసుకొని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చినట్లు సమాచారం.
ALSO READ:Shreya Bhopal: అఖిల్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న శ్రీయ భూపాల్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?