ఒకప్పటి స్టార్ హీరోయిన్ భానుప్రియ (Bhanupriya ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఈమె చెల్లెలు శాంతి ప్రియ (Shanti Priya) కూడా హీరోయిన్ అన్న విషయం చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. ఈమె తెలుగులో మహర్షి, కలియుగ అభిమన్యుడు, సింహ స్వప్నం వంటి చిత్రాలలో హీరోయిన్గా నటించింది. అలా తెలుగు, తమిళ్ సినిమాలలో హీరోగా నటించిన శాంతి ప్రియ.. కెరియర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ ప్రముఖ నటుడు సిద్ధార్థ్ రాయ్ (Siddharth Rai) ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ఈమె.. అనంతరం సినిమాలకు దూరమయింది.
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్ చెల్లి..
ఇకపోతే 1999లో వీరి వివాహం జరగగా.. 2004లో సిద్ధార్థ్ రాయ్ గుండెపోటుతో మరణించారు. తన భర్త చనిపోక ముందే శాంతి ప్రియ బుల్లితెర సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది. అలా పలు సీరియల్స్, టీవీ షోలు చేస్తున్న సమయంలో భర్త చనిపోవడంతో తీవ్రమైన బాధను అనుభవించింది. పెళ్లయిన అతి తక్కువ సమయంలోనే భర్త దూరం అవడంతో ఆమె బాధ వర్ణనాతీతం అని చెప్పాలి. ఇకపోతే ఈ మధ్యకాలంలో మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని చూస్తున్న ఈమె.. తాజాగా పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో శాంతి ప్రియ గుండు గీయించుకొని.. బ్రౌన్ కలర్ బ్లేజర్ ధరించి హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
ఇప్పటికీ నా భర్త నాతోనే ఉన్నారు – శాంతి ప్రియ
ఇకపోతే తాజాగా తాను గుండు గీయించుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. “నేను ఈమధ్య గుండు గీయించుకున్నాను. అయితే ఇది ఒక కొత్త అనుభూతిని కలిగిస్తోంది.. మహిళగా మనం మన సమాజంలోని కట్టుబాట్లు, నియమ నిబంధనలను పాటిస్తూ.. మనల్ని మనమే కట్టడి చేసుకుంటున్నాము. నేను కూడా ఇలా చేసి అలాంటి వాటి నుండి విముక్తి పొందాను. ప్రపంచం మనపై విధించిన అందం ప్రమాణాలను నాశనం చేయాలని, నేను ఇలా చేశాను. ధైర్యం, నమ్మకంతోనే ఇలా చేశాను. ఇక ఇప్పుడు నా భర్త వేసుకునే బ్లేజర్ ని నేను వేసుకొని నా భర్త ఇంకా నా వద్ద ఉన్నారని ఫీల్ అవుతున్నాను” అంటూ ఒక పోస్ట్ షేర్ చేసింది శాంతి ప్రియ. ఇక శాంతి ప్రియ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవ్వగా.. కొంతమంది ఆమెను అభినందిస్తుంటే.. మరికొంతమంది విమర్శలు గుర్తిస్తున్నారు. ఏది ఏమైనా శాంతిప్రియ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈమె అక్క భానుప్రియ విషయానికి వస్తే.. ఇండస్ట్రీలో చిరంజీవిని మొదలుకొని ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక భానుప్రియ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రభాస్ లాంటి హీరోలకు తల్లిగా నటించి మెప్పించింది.