CM Chandrababu – Bill Gates: ఈ ఫోటో చూడండి.. ఇది కదా ఏపీకి కావాల్సింది.. ఇందుకోసమే కదా నవ్యాంధ్ర ఐదేళ్లుగా ఎదురు చూసింది.. ఆంధ్రుల నిండు గౌరవాన్ని.. ఢిల్లీ వీధుల్లో సీఎం చంద్రబాబు సగర్వంగా చాటారు. తాను గ్లోబల్ లీడర్‌నని మరోసారి ప్రపంచానికి తెలియజేశారు. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్‌ను ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. 40 నిమిషాలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్, సంక్షేమం కోసమై గేట్స్ ఫౌండేషన్ సహకారంపై చర్చించారు.
చంద్రబాబు ఉంటే టెక్నాలజీ గురించి మాట్లాడకుండా ఉంటారా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఏఐ సాంకేతిక వినియోగంపై ఆలోచనలు పంచుకున్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ తదితర రంగాల్లో టెక్నాలజీ వాడకంపై గేట్స్, బాబుల మధ్య చర్చ జరిగింది. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 పై బిల్ గేట్స్‌కు తన విజన్ వివరించారు సీఎం చంద్రబాబు.
కేంద్ర పెద్దలను కలిసేందుకు ఢిల్లీలో పర్యటిస్తున్నారు చంద్రబాబు. కేవలం రాజకీయాలు మాత్రమే చేయరుగా. అందుబాటులో ఉండే ఓ ఒక్క అవకాశాన్నీ వదులుకోరాయన. మైక్రోసాఫ్ట్ అధినేత ఢిల్లీలోనే ఉన్నారని తెలిసి.. అపాయింట్‌మెంట్ అడిగారు. బిల్ గేట్స్ తో మీటింగ్ అంత ఈజీ కాదు మరొకరికి అయితే. అక్కడున్నది చంద్రబాబు. గతంలో బిల్ గేట్స్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చిన ఘనత ఆయనది. మైక్రోసాఫ్ట్ ఆఫీసును హైటెక్ సిటీలో ఏర్పాటు చేయించిన చొరవ చంద్రబాబుది. అప్పటి నుంచీ వారిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. బాబు విజన్ ను గేట్స్ బాగా ఇష్టపడతారని అంటారు. ఇన్నేళ్ల తర్వాత మరోసారి బిల్ గేట్స్ ను కలుసుకునే అవకాశాన్ని చంద్రబాబు ఎలా వదులుకుంటారు. అందుకే గేట్స్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేయడం.. ఆయన ఎంత బిజీగా ఉన్నా.. బాబు అడిగారని కలిసేయడం జరిగిపోయింది. ఇద్దరు దిగ్గజాల మధ్య 40 నిమిషాల పాటు ప్రయోజనకర సమావేశమూ జరిగింది.
ALSO READ: నాగబాబు నయా రోల్.. నోరు ఉన్నోడిదే రాజ్యమా?
చంద్రబాబు సీఎం అయితే ఏ మార్పు వస్తుంది? అని అనుకునే జనాలకు తాజా భేటీ ఓ స్ట్రాంగ్ మెసేజ్. బాబు వస్తే.. ఏపీ తలరాత మారుతుంది. రాష్ట్రానికి పెట్టుబడులు వరద పారుతుంది. అంతర్జాతీయ కంపెనీలు అమరావతి వైపు అడుగులు వేస్తాయి. పాలన పారదర్శకంగా సాగుతుంది. వాట్సాప్ లోనే వందలాది సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. డ్రోన్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ ప్రజలకు చేరువవుతుంది. ఆ దిశగా మరో అడుగు ముందుకు పడింది చంద్రబాబు, బిల్ గేట్స్‌ల మీటింగ్‌తో.
ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి మళ్లీ పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. మరోసారి ప్రధాని మోదీతో ఆ ఆరంభానికి శ్రీకారం చుట్టడానికే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అనుకోని అతిథిలా మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబుతో సమావేశం అవడం ఏపీకి శుభసూచకం. దటీజ్ చంద్రబాబు. బాబు సీఎం అయితే ఎట్టా ఉంటాదో ఇప్పటికైనా తెలిసిందా? ఎనీ డౌట్స్?
Had a wonderful meeting with Mr @BillGates today. We had a very productive discussion on how the GoAP and the Gates Foundation can collaborate for the development and welfare of the people of Andhra Pradesh. We explored the use of advanced technologies like Artificial… pic.twitter.com/EtNAYY28L6
— N Chandrababu Naidu (@ncbn) March 19, 2025