Sudeep Pandey: ప్రస్తుత పరిస్థితులు, మారుతున్న జీవన శైలి కారణంగా అతి చిన్న వయసులోనే చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు గుండెపోటు అనేది 50 సంవత్సరాలు దాటిన తర్వాత పెద్దవాళ్లలో కనిపించేది. కానీ ఇప్పుడు 8 సంవత్సరాల చిన్నారులను కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఎన్నో సందర్భాలలో గుండెపోటుతో చనిపోయిన ఎంతోమందిని మనం చూసాము. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో భవిష్యత్తు ఉన్న యంగ్ హీరోలు గుండెపోటుతో మరణించి, అందరిని ఆశ్చర్యపరిచారు. అలా ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushanth Singh Rajputh) కూడా గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన జరిగి ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఆయనను అభిమానులు మరిచిపోవడం లేదు. అయితే ఈ మాయదారి గుండెపోటు ఇప్పుడు మరో టాలెంటెడ్ అండ్ యంగ్ హీరోని బలి తీసుకుంది.
గుండెపోటుతో యువహీరో మృతి..
జీవితంలో ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన సినిమా షూటింగ్ లోనే గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇక హుటాహుటిన హాస్పిటల్ కి తరలించినా ఫలితం లేకపోయిందని, ఆయన అభిమానులు , కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ భోజ్ పురి నటుడు, నిర్మాత ,రాజకీయ నాయకుడు అయినా సుదీప్ పాండే (Sudeep Pandey). ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు మంచి అభిరుచి కలిగిన నిర్మాత కూడా.. రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అలాంటి ఈయన చిన్న వయసులోనే మరణించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక సుదీప్ మరణ వార్తతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇదిలా ఉండగా గత పది రోజుల క్రితం అనగా జనవరి 5వ తేదీన ఈయన పుట్టినరోజు కాగా,పలువురు అభిమానులు సెలబ్రిటీలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కన్నీటి పర్యంతమవుతున్న కుటుంబ సభ్యులు..
ఇక బర్తడే సెలబ్రేషన్స్ ముగించుకొని ఎప్పటిలాగే షూటింగ్ కోసం ముంబై వచ్చాడు. అలా ఒక సినిమా షూటింగ్లో బుధవారం అనగా జనవరి 15వ తేదీన సుదీప్ పాండే పాల్గొన్నారు. ఇక ఉన్నట్లుండి గుండెపోటుతో కుప్ప కూలిపోయారు. ఇకపోతే భోజ్ పురి సినీ పరిశ్రమలో యాక్షన్ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన, నటనతో పాటు నిర్మాణంలో కూడా పాలు పంచుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా కూడా నిలిచారు. ఇలాంటి ఈయన.. ఇప్పుడు చిన్న వయసులోనే మరణించడంతో ఆయన అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ధ్రువీకరించి కన్నీటి పర్యంతం అవుతున్నారు.
సుదీప్ పాండే సినిమాలు..
సుదీప్ పాండే సినిమాల విషయానికి వస్తే.. 2007లో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ‘భోజ్ పురి భయ్యా’ ఈయన మొదటి సినిమా. తక్కువ కాలంలోనే యాక్షన్ హీరోగా పేరు దక్కించుకున్నాడు సుదీప్ పాండే. ఖూనీ దంగల్, షరాబీ, ఖుర్బానీ, హమర్ సంగి బజరంగీ బాలి, హమర్ లాల్కర్ వంటి ఎన్నో చిత్రాలు ఈయనకు మంచి గుర్తింపును అందించాయి. ఇక సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈయన ఎన్సీపీ పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కూడా పనిచేశారు సుదీప్ పాండే.