Champions Trophy Ticket Prices: 2024 డిసెంబర్ 24వ తేదీన మినీ వరల్డ్ కప్ గా భావించే ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో ఫైనల్ మ్యాచ్ తో కలిపి మొత్తం 15 మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. అంటే ఒక్కో గ్రూపులో నాలుగు టీమ్ లు ఉంటాయి.
Also Read: Jasprit Bumrah: టీమిండియాకు రిలీఫ్… తన గాయంపై బుమ్రా కీలక ప్రకటన
గ్రూప్ – ఏ లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్. గ్రూప్ – బి లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ.. మార్చ్ 9 న ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది. ఒక్క టీమిండియా మాత్రమే తన అన్ని మ్యాచ్ లను దుబాయ్ లో ఆడబోతోంది. అయితే పాకిస్తాన్ లో జరగబోయే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లకు సంబంధించిన టికెట్ రేట్ ల గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్వదేశంలో జరిగే మ్యాచ్ ల టికెట్ల ధరలను విడుదల చేసింది. అంటే లాహోర్, కరాచీ, రావల్పిండిలో జరగబోతున్న మ్యాచ్ ల టికెట్ల ధరలను విడుదల చేసింది. ఇందులో ఒక్కో టికెట్ ధరని రూ. 1000 రూపాయలుగా ఫిక్స్ చేసింది. అంటే ఇది భారత కరెన్సీలో 310 రూపాయలతో సమానం అన్నమాట. ఈ ధరలు క్రికెట్ అభిమానులకు శుభవార్త అని చెప్పాలి.
ఒకవేళ ఇదే టోర్నీ భారత్ లో గనుక నిర్వహిస్తే ఒక్కో టికెట్ ధర రెండు వేలకు పైగానే ఉంటుంది. అయితే భారత్ ఈ టోర్నీలోని తన అన్ని మ్యాచ్ లని దుబాయ్ వేదికగా ఆడబోతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ల టికెట్ల ధరలను మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. కానీ దుబాయిలో భారత్ ఆడే మ్యాచ్ ల ద్వారా లబ్ధి పొందాలని పాకిస్తాన్ భావిస్తుంది.
ముఖ్యంగా హై వోల్టేజ్ యాక్షన్ మ్యాచ్ అయిన భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ లకు భారీగా టికెట్ల రేట్లు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో భారత్ ఆడే మ్యాచ్ల ద్వారా మంచి టిక్కెటింగ్ ఆదాయాన్ని రాబట్టవచ్చని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యోచిస్తుంది. త్వరలోనే ఈ టికెట్ రేట్లపై ఎమిరేట్ క్రికెట్ బోర్డు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), పాకిస్తాన్ కి నివేదిక సమర్పించిన తర్వాత ఫీజులపై నిర్ణయం రాబోతోంది.
Also Read: Nitish Kumar Reddy: కోడి పందాల్లో టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్..!
దీంతో భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ల ధర ఎంత ఉండబోతుందో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే పాకిస్తాన్ లో జరగబోయే బంగ్లాదేశ్ – పాకిస్తాన్ మ్యాచ్ కి ఒక్కో టికెట్ ధర రూ. 2000 గా ఫిక్స్ చేసింది. అంటే ఇది భారత కరెన్సీలో 620 రూపాయలు. ఈ మ్యాచ్ పాకిస్తాన్ లోని రావల్పిండిలో జరగబోతోంది. మొత్తానికి లాస్ లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. భారత్ మ్యాచ్ ల ద్వారా తమ బోర్డుని గట్టెక్కించాలని భావిస్తోంది.
🚨 TICKET PRICES FOR ICC CHAMPIONS TROPHY 2025. (Samaa TV)#ChampionsTrophy2025 pic.twitter.com/tyF802E68P
— Huzaifa (@Huzaifa_Says11) January 15, 2025