Saif Ali Khan Health Update: ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై ఒక ఆగంతకుడు.. ముంబైలోని బాంద్రా లో ఉన్న తన ఇంటిలోకి అర్ధరాత్రి వెళ్లి.. కత్తితో దాడి చేసిన విషయం గత కొద్దిసేపటి క్రితం కలకలం సృష్టించింది. దీంతో వెంటనే దగ్గరలో ఉన్న లీలావతి హాస్పిటల్ కి ఆయనను తరలించగా.. చికిత్స చేస్తున్న వైద్యులు.. సైఫ్ అలీఖాన్ ఆరోగ్యంపై పలు విషయాలు తెలియజేశారు. సైఫ్ అలీ ఖాన్ ను 6సార్లు కత్తితో పొడిచారని లీలావతి హాస్పిటల్ వర్గాలు తెలపగా.. అందులో రెండు గాయాలు మరీ లోతుగా ఉన్నాయని తెలిపారు. న్యూరో సర్జన్ డాక్టర్ డింగే, కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ జైన్ ఆయనకు సర్జరీ చేస్తున్నట్లు వెల్లడించాయి. ఇక సైఫ్ అలీ ఖాన్ ను చూడడానికి ఆయన భార్య కరీనా కపూర్ (Kareena Kapoor) , ఆమె సోదరీ కరిష్మా కపూర్ (Karishma Kapoor) తెల్లవారుజామున 4:30గంటలకే ఆసుపత్రికి వచ్చారని తెలిసింది. ఇకపోతే సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి..
అసలు విషయంలోకి వెళ్తే ఈరోజు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన ఒక దుండగుడు.. సైఫ్ అలీఖాన్ ఇంట్లో పనిచేసే పనిమనిషితో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఈయన జోక్యం చేసుకొని, ఆ వ్యక్తిని శాంతింప చేయడానికి ప్రయత్నించగా..ఆ ఆగంతకుడు సైఫ్ అలీఖాన్ పై దాడి చేసి గాయపరిచాడు. మొత్తం ఆరుసార్లు కత్తితో పొడిచ, సైఫ్ అలీ ఖాన్ ను బాధపెట్టాడు. ఇక గురువారం తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి సైఫ్ ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఇక ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మీడియా కథనాలు వైరల్..
ఇకపోతే సోషల్ మీడియాలో సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురైన సంఘటనకు సంబంధించి విరుద్ధమైన కథనాలు వెలువడుతున్నాయి. కొన్ని మీడియా సంస్థలు ఒక దొంగ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు అని కామెంట్లు చేస్తుంటే.. మరికొన్ని మీడియా సంస్థలు గుర్తుతెలియని వ్యక్తి లోపలికి ప్రవేశించి, అతని పని మనిషితో గొడవకు దిగి, సైఫ్ లోపలికి రావడానికి ప్రయత్నించినప్పుడు అతడి పై దాడి చేశాడు అని వార్తలు వైరల్ చేస్తున్నారు.. అయితే ఇందులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సైఫ్ అలీఖాన్..
ఇకపోతే ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నార్త్ లో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన , ఈ మధ్య తెలుగులో కూడా సినిమాలు చేస్తూ మరింత క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన రామాయణం సినిమాలో రావణాసుర పాత్ర పోషించిన సైఫ్ అలీఖాన్.. ఇటీవల కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR) హీరోగా చేసిన దేవర (Devara ) సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ చేసి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.