BigTV English

Kalki Movie: బిగ్ బి బ‌ర్త్‌డే స్పెషల్ .. కల్కి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Kalki Movie: బిగ్ బి బ‌ర్త్‌డే స్పెషల్ .. కల్కి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
Kalki Movie

Kalki Movie: నిన్న బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ 81వ పుట్టినరోజు సందర్భంగా..కల్కి మూవీ టీం స్పెషల్ విషెస్ తెలిపింది. ప్రస్తుతం బిగ్ బి అమితాబ్,ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ కల్కి లో కీ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది కల్కి మూవీ టీం. ఈ సినిమాలో అమితాబ్ ఫస్ట్ లుక్ ను ఈ సందర్భంగా కల్కి బృందం విడుదల చేసింది. 81 ఏళ్ల వయసులో కూడా స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గిపోకుండా యాక్షన్ ఇరగదీస్తున్న అమితాబ్ నిజంగా ఒక సినిమా లెజెండ్.


1969లో భవన్ షోమ్ అనే బాలీవుడ్ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన అమితాబ్ ఆ తర్వాత అతి స్వల్ప కాలంలోని స్టార్ హీరోగా ఎదిగాడు. ఎన్నో అద్భుతమైన చిత్రాలు నటించడమే కాకుండా తనకంటూ కోట్ల మంది అభిమానులను సంపాదించుకోగలిగాడు. కానీ కల్కి మూవీ టీం విడుదల చేసిన అమితా పోస్టర్ లో అతని ముఖం పూర్తిగా అయితే కనిపించదు. కావాలని సస్పెన్స్ మెయింటైన్ చేయడం కోసమే అలా చేశారు అన్న విషయం బాగా అర్థమవుతుంది. ఇందులో కేవలం బిగ్ బి కళ్ళు మాత్రమే కనిపించడం విశేషం.

చేతిలో విల్లులాంటి ఆయుధం నుదుటన బొట్టు చూస్తుంటే బిగ్ బి ఒక సాధువులా …అలాగే ఒక యోధుడిలా కనిపిస్తున్నాడు. ఈ ఫస్ట్ లుక్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన కల్కి మూవీ టీమ్…. మీ ప్రయాణంలో మేము కూడా ఒక భాగం అవ్వడం ఎంతో సంతోషకరమైన విషయం అని ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ కూడా జత పరిచింది. ఫస్ట్ లుక్ షేర్ చేసిన వెంటనే బిగ్ బి లుక్ గెటప్ చాలా బాగుంది అంటూ అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.


బాహుబలి తర్వాత సరియైన సక్సెస్ లేక బాధపడుతున్న ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ కల్కి చిత్రంపై డార్లింగ్ ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పైగా ఈ చిత్రంలో ఎందరో అగ్ర తారాగణం నటిస్తున్నారు. బాలీవుడ్ దివా దీపికా పదుకొణె ఈ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా చేస్తుండగా మరోపక్క తమిళ్ అగ్ర హీరో ……. ఉలగనాయగన్‌గ కమల్ హాసన్ ఈ మూవీలో మరొక ప్రామినెంట్ రోల్ చేస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఎంతో ప్రెస్టేజ్ గా రూపొందిస్తున్న ఈ చిత్రం బడ్జెట్ సుమారు 400 కోట్లు.

మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ “కల్కి 2989 ఏడీ” మూవీ కి దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన ఫస్ట్ గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చింది. వీడియో స్టార్టింగ్ లో …ఎప్పుడు అయితే ఈ ప్రపంచాన్ని అంధకారమనేది ఆక్రమిస్తుందో.. అప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది.. అంతం అనేది ఆరంభం అవుతుంది…అంటూ వచ్చే ఇంట్రో లో చిత్రం గురించి మాంచి హింట్ ఇచ్చారు. భూ ప్రపంచాన్ని దుష్టశక్తుల నుంచి కాపాడే ఇండియన్ సూపర్ మాన్ కల్కి అవతారంలో ప్రభాస్ కనిపించనున్నాడు అన్న విషయం వీడియో చూస్తే ఈజీగా అర్థవుతుంది.ఇందులో ప్రభాస్ కు దిశా నిర్దేశం చేసే పాత్రలో అమితాబ్ కనిపిస్తారు అని టాక్.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×