BigTV English

Ram Gopal Varma: వ్యూహం , శపథం రిలీజ్ కు రెడీ .. డేట్స్ ఫిక్స్

Ram Gopal Varma: వ్యూహం , శపథం రిలీజ్ కు రెడీ .. డేట్స్ ఫిక్స్
Ram Gopal Varma


Ram Gopal Varma: ఏపీ రాజకీయాలు ఇప్పటికే సెగలు పొగలు కక్కుతున్నాయి. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని ఈ పరిస్థితుల్లో త్వరలో ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అగ్నిలో ఆజ్యం పోసినట్లు రాంగోపాల్ వర్మ తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా ,ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఉండే విధంగా ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలను విడుదల చేయడానికి ఆర్.జి.వి రెడీ అవుతున్నాడు.

ఆ రెండు చిత్రాలకు వ్యూహం ,వ్యూహం-2 (శపథం) అని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే వ్యూహం మూవీ నుంచి వస్తున్న పోస్టర్లు, టీజర్లు సంచలనం సృష్టించడమే కాకుండా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ మీమర్స్ కు మంచి కాలక్షేపాన్ని అందిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత జరిగిన పరిస్థితులు అలాగే జగన్ పై పెట్టిన కేసులు వ్యూహంలో వివరిస్తే…కఠిన పరిస్థితుల ను ఎదుర్కొంటూ ముఖ్యమంత్రిగా జగన్ విజయం సాధించిన పరిస్థితులను ‘శపథం’లో వివరిస్తాడు.


ఈ మూవీ లో జగన్ పాత్ర అజ్మల్, భారతి పాత్ర మానస పోషిస్తున్నారు. కాసేపటి క్రితమే ఈ సినిమాల విడుదల తేదీని రాంగోపాల్ వర్మ తన X (ట్విట్టర్) లో షేర్ చేశాడు. నవంబర్ 10 న మొదటి భాగం ‘వ్యూహం’, జనవరి 25న రెండవ భాగం ‘శపథం’ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ తెరకెక్కించాడు వర్మ. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్న ఈ తరుణంలో ఈ రెండు చిత్రా లను విడుదల చేయబోతున్నాడు.

ఇక ఎన్నికలు జరగబోతున్నాయి అన్న సమయంలో ఇప్పుడు వీటిని వరుస పెట్టి విడుదల చేయడానికి రెడీ అవ్వడంతో ఇది మరింత ఆసక్తికరంగా మారింది. ఏపీ రాజకీయాలపై ఈ చిత్రం ప్రభావం చూపించే అవకాశం ఉంది అని కొందరు గట్టిగా నమ్ముతున్నారు.

మొదటి పార్ట్ వ్యూహం సినిమా లో జగన్ పాదయాత్ర…అలాగే అతనిపై పెట్టిన కేసుల వివరణ ఇస్తూ జగన్ గురించి ప్రజల్లో ఒక సింపతి క్రియేట్ చేసే విధంగా స్క్రిప్ట్ డెవలప్ చేశారు అని అర్థం అవుతుంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత పరిస్థితులను ఎమోషనల్ గా తెరకెక్కించి కాస్త సెంటిమెంటల్ గా వర్క్ ఔట్ అయ్యేవిధంగా ఈ మూవీ ఉండే అవకాశం ఉంది. వ్యూహం, శపథం …ఈ రెండు చిత్రాలకు సంబంధించిన పోస్టర్లను కూడా రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి ఈ చిత్రాలు జనాలపై ప్రభావం చూపిస్తాయా లేక తేలిపోతాయా చూడాలి చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×