BigTV English
Advertisement

Big Boss season 8: బిగ్ బాస్ హౌస్ కి గెస్టులుగా మహేష్, రాజమౌళి.. నిజమేనా?

Big Boss season 8: బిగ్ బాస్ హౌస్ కి గెస్టులుగా మహేష్, రాజమౌళి.. నిజమేనా?

Big Boss season 8 chief guests Mahesh babu Rajamouli expecting: బిగ్ బాస్ సీజన్ 8 సమయం దగ్గరయ్యే కొద్దీ బుల్లితెర వీక్షకులలో టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటిదాకా వీళ్లొస్తున్నారు వాళ్లొస్తున్నారంటూ ఊహాగానాలే తప్ప నిజానికి ఎవరి పేర్లూ అఫిషియల్ గా బయటకు రాలేదు. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ లో ఏం జరగబోతోందో ముందుగానే తెలివైన ప్రేక్షకులు చెప్పేస్తున్నారు.ఆఖరుకు విజేత ఎవరో కూడా రెండు వారాల ముందే తెలిసిపోయింది ప్రేక్షకులకు. అందుకే ఈ సారి పక్కా ప్లానింగ్ ప్రకారమే బిగ్ బాస్ అప్ డేట్స్ ఇవ్వనున్నారు. షో మొదలైన రోజే పార్టిసిపెంట్స్ ఎవరో తెలిసేలా చేద్దామనే యోచనలో ఉన్నారు. అలా చేస్తేనే ఈ షోకి మంచి హైప్ వస్తుందని భావిస్తున్నారు నిర్వాహకులు. ఇక బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున ఇప్పటికే ప్రొమోలు మొదలుపెట్టేశారు. ప్రతి శని, ఆదివారాలలో నాగార్జున కోసం అంతా ఎదురుచూసేలా చేయగలుగుతున్నారంటే ఈ షోలో నాగ్ డిమాండ్ ఏమిటో తెలుస్తుంది.ఎప్పటిలాగానే ఈ సారి కూడా ఎంటర్ టైన్ మెంట్ డబుల్ డోస్ లో ఉండబోతున్నట్లు ప్రమోషన్లలో హోరెత్తిస్తున్నారు. అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ అంటూ ఊదరగొట్టేస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఓ సరికొత్త వార్త వైరల్ అవుతోంది.


ఏడు సీజన్లలోనూ గెస్ట్ గా రాని మహేష్

బిగ్ బాస్ ఇప్పటిదాకా నిర్వహించిన ఏడు సీజన్లలోనూ మహేష్ బాబు గెస్ట్ గా రాలేదు. కనీసం తన సినిమాలను ప్రమోట్ చేసుకోలేదు. లాస్ట్ టైమ్ కూడా విన్నర్ ను మహేష్ బాబు ద్వారా ప్రకటిద్దామని అనుకున్నారు. కానీ అదంతా ఉత్తుత్తి ప్రచారమే అని తేలింది. అయితే ఈ సారి ఎలాగైనా మహేష్ బాబును గెస్ట్ గా రప్పిద్దామని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు , రాజమౌళి మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే రాజమౌళి నుంచి చిత్ర నిర్మాతల నుంచి ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. మొన్న మహేష్ బాబు పుట్టినరోజున ఏదైనా అప్ డేట్ వస్తుందని భావించారు అభిమానులు. కానీ వారికి నిరాశే ఎదురయింది. అయితే రాజమౌళి, మహేష్ బాబు కలిసి బిగ్ బాస్ హౌస్ కి ఒక రోజు గెస్టులుగా వచ్చి ఆడియెన్స్ ని సర్ ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నారని సమాచారం. అందులోనే తమ సినిమా గురించి విశేషాలను కూడా ప్రేక్షకులకు అందించాలని భావిస్తున్నారట. ఎలాగూ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టి ప్రచారం మొదలెట్టే కన్నా బిగ్ బాస్ ను మించిన వేదిక లేదని భావిస్తున్నట్లు సమాచారం.


రాజమౌళి వెరైటీ పబ్లిసిటీ..

ఆర్ఆర్ఆర్ మూవీకి కూడా రాజమౌళి వెరైటీగా పబ్లిసిటీ మొదలుపెట్టారు. వర్కింగ్ టైటిల్ గా అనుకున్న ఆర్ఆర్ఆర్ చివరకు అదే ఖాయం అయింది. ఇక ఆ మూవీ సాధించిన రికార్డులు చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. అవార్డులు, రివార్డులతో సహా కమర్షియల్ గానూ టాప్ మోస్ట్ కలెక్షన్లు సాధించడం విశేషం. అందుకే ఈ సారి రాజమౌళి ప్లానింగ్ మామూలుగా ఉండదంటున్నారు. మహేష్ బాబును గ్లోబల్ స్టార్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మహేష్ బాబు, రాజమౌళి కలిసి బిగ్ బాస్ రియాలిటీ షో కి వస్తే ప్రిన్స్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఖాయమే..బిగ్ బాస్ రేటింగ్ కూడా ఒక్కసారిగా హైప్ కు వెళ్లిపోవడం ఖాయమే అంటున్నారు సినీ క్రిటిక్స్.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×