BigTV English

Sheikh Hasina: ప్రభుత్వ పతనానికి అమెరికానే కారణం: షేక్ హసీనా

Sheikh Hasina: ప్రభుత్వ పతనానికి అమెరికానే కారణం: షేక్ హసీనా

Sheikh Hasina hints at US role in ouster from Bangladesh: బంగ్లాదేశ్‌లో జాబ్ కోటా ఆర్డర్‌పై విద్యార్థులు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిరసనలు తీవ్ర హింసాకాండకు దారితీశాయి. ఇందుకు గానూ ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడంతోపాటు బంగ్లాదేశ్ నుంచి పారిపోవాల్సి వచ్చింది. తాజాగా, తమ ప్రభుత్వ పతనానికి అమెరికానేే కారణమని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు.


అయితే అమెరికా దేశానికి సెయింట్ మార్టిన్ అనే ద్వీపాన్ని అప్పగించినందుకే ఈ సమస్య వచ్చిందన్నారు. ఆనాడు బంగాళఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకే ఆ ద్వీపాన్ని అప్పగించారని ఆరోపించారు. కానీ ఈ విషయంలో ఛాందసవాదుల వల్ల తప్పుదోవ పట్టవద్దని కోరారు. ఇదిలా ఉండగా, షేక్ హసీనా ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నారు.

‘దేశంలో అల్లర్లు పెరుగుతున్నందున ఆపేందుకే రాజీనామా చేశా. ఇప్పటికే చాలామంది అమాయక విద్యార్థులు చనిపోయారు. విద్యార్థులు మృతదేహాలపై అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. కానీ దీనికి నేను అనుమతించలేదు. నాదేశ ప్రజలను అభ్యర్థిస్తున్నా. సెయింట్ మార్టిన్ దీవి సార్వభౌమాధికారాన్ని అమెరికాకు అప్పగించి..బంగాళఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు అనుమతి ఇచ్చింటే ఇప్పటికీ అధికారంలో ఉండగలిగేదాన్ని.’ అని షేక్ హసీనా అన్నారు.


Also Read: బంగ్లాదేశ్ లో 7 లక్షల హిందువుల భారీ ర్యాలీ.. దాడులకు వ్యతిరేకంగా నిరసన!

‘నేను బంగ్లాదేశ్ ‌లోనే ఉంటే ఇంకా చాలామంది ప్రాణాలు పోయేవి. దేశ ప్రజల ఆస్తులు, మానవ వనరులు మరింత దెబ్బతినేవి. మీరు మీ ఓటుతో నన్ను ఎన్నుకోవడంతోనే ప్రధానిగా నియామకమయ్యాను. ఎప్పటికీ మీరే నా బలం. కానీ నా పార్టీ అవామీ లీగ్ కు చెందిన నాయకులు కొంతమంది హత్యకు గురయ్యారు.ఇళ్లను సైతం తగలబెట్టారని వార్తలు వచ్చాయి. నా గుండె రోధిస్తుంది. మళ్లీ మీరు అనుమతితో త్వరలోనే తిరిగి వస్తా. బంగ్లా ప్రజల భవిష్యత్తు కోసం అల్లాను ప్రార్థిస్తున్నా. నా తండ్రి దేశం కోసం ప్రాణాలు అర్పించారు.’ అని షేక్ హసీనా భావోద్వోగానికి గురయ్యారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×