Kacheguda to Arunachalam Offers: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలం దర్శించుకోవాలని చాలా మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసం భారతీయ రైల్వే కొత్త ప్యాకేజీని పరిచయం చేసింది. ‘అరుణాచల మోక్ష యాత్ర’ పేరుతో IRCTC ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ యాత్రలో భాగంగా కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి దర్శనంతో పాటు పుదుచ్చేరిలోని పకృతి అందాలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది.
ప్యాకేజీ ధరల వివరాలు
ఇక ఈ యాత్ర ప్రతి గురువారం కాచిగూడ స్టేషన్ నుంచి మొదలవుతుంది. 4 రాత్రులు, 5 పగళ్లు ఈ టూర్ కొనసాగుతుంది. జూన్ 19 నుంచి ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ప్యాకేజీ వివరాలను పరిశీలిస్తే..
థర్ ఏసీ: డబల్ షేరింగ్ రూ. 20,060, ట్రిపుల్ షేరింగ్ రూ. 15,165.. 11 ఏళ్లలోపు చిన్నారులకు బెడ్ తో రూ. 11,750, బెడ్ లేకుండా రూ. 9,950గా టికెట్ ధర నిర్ణయించారు.
స్లీపర్ క్లాస్: డబల్ షేరింగ్ రూ. 17,910, ట్రిపుల్ షేరింగ్ రూ.13,460, 11 ఏళ్లలోపు చిన్నారులకు బెడ్ తో రూ. 9,590, బెడ్ లేకుండా రూ. 7,800గా టికెట్ ధర నిర్ణయించారు.
యాత్ర వివరాలు..
యాత్రలో భాగంగా గురువారం నాడు సాయంత్రం 5 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రైలు (17653) బయల్దేరుతుంది. తొలి రోజు రాత్రి అంతా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రెండో రోజు పుదుచ్చేరి స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ హోటల్ లో చెకిన్ అవుతారు. అనంతరం అరబిందో ఆశ్రమం, పారడైజ్ బీచ్ చూసి రాత్రి అక్కడే బస చేస్తారు. మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి, అక్కడి నుంచి 120 కి. మీ దూరంలో ఉన్న అరుణాచలం చేరుకోవాల్సి ఉంటుంది. రాత్రి బస అక్కడే ఉంటుంది. నాలుగో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయ్యాక అక్కడి నుంచి 120 కి. మీ దూరంలోని కాంచీపురం ప్రయాణం ఉంటుంది. కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వరాలయం దర్శించుకుంటారు. అక్కడి నుంచి 40 కి. మీ దూరంలోని చెంగల్పట్టు నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది. రాత్రి అంతా ప్రయాణించి 5వ రోజు ఉదయం 8గంటలకు కాచిగూడ స్టేషన్ కు చేరుకుంటారు.
Read Also: 180 ఏళ్లు నడిచిన రాయల్ రైలుకు గుడ్ బై, చివరి స్టాప్ కు చేరేది ఎప్పుడంటే?
ప్యాకేజీ లో భక్తులకు అందించే సదుపాయాలు..
ప్యాకేజీని బట్టి సదుపాయాలు అందిస్తారు. థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ టికెట్ ఉన్నవారికి స్థానికంగా ప్రయాణం చేయడానికి వాహనం ఏర్పాటు చేస్తారు. రెండు రోజుల బస, ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా IRCTC అందిస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తుంది. IRCTC పాలసీ ప్రకారం.. క్యాన్సిలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి. మరింత సమాచారం, బుకింగ్ కోసం IRCTC వెబ్ సైట్ ను చూడండి. ఈ చక్కటి టూర్ ప్యాకేజీని భక్తులు వినియోగించుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
Read Also: ఈ నగరంలో అస్సలు ట్రాఫిక్ జామ్ లే ఉండవు.. ఎక్కడో కాదు ఇండియాలోనే!