BigTV English

Big Tv Exclusive : బోయపాటి – నాగ చైతన్య కాంబో సెట్… యాక్షన్ దద్దరిల్లిపోవాల్సిందేనా..?

Big Tv Exclusive : బోయపాటి – నాగ చైతన్య కాంబో సెట్… యాక్షన్ దద్దరిల్లిపోవాల్సిందేనా..?

Big Tv Exclusive : ‘తండేల్’ (Thandel) మూవీతో ఫస్ట్ పాన్ ఇండియా సక్సెస్ ని అందుకున్న హీరో నాగచైతన్య. ప్రస్తుతం ఈ హీరో ‘తండేల్’ మూవీ తెచ్చిన విజయాన్ని ఎంజాయ్ చేస్తుండగా, ఆయన నెక్స్ట్ మూవీ విషయంపై తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఆ అప్డేట్ ప్రకారం ఊహించని విధంగా నాగ చైతన్య (Naga Chaitanya) – బోయపాటి (Boypati Srinu) కొత్త కాంబోలో మూవీ సెట్ అయినట్టు తెలుస్తోంది. ఆ వార్తలు గనుక నిజమైతే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం.


నాగచైతన్య – బోయపాటి కాంబో సెట్

అక్కినేని నాగచైతన్య ‘తండేల్’ తర్వాత విరూపాక్ష డైరెక్టర్ తో ఒక మైథాలజికల్ థ్రిల్లర్ మూవీని చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలు కాగా, నాగచైతన్య నెక్స్ట్ మూవీ ఏంటి అనేది ఇంకా సస్పెన్స్ గా ఉంది. దానికి సమాధానంగా తాజాగా ఒక క్రేజీ వార్త బయటకు వచ్చింది.


యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నాగచైతన్య నెక్స్ట్ మూవీ తెరకెక్కబోతోంది అనేది లేటెస్ట్ సమాచారం. నాగచైతన్య అనగానే సాఫ్ట్ గా, రొమాంటిక్ జానర్ సినిమాలే ఎక్కువగా గుర్తొస్తాయి. ఇక మరోవైపు బోయపాటి అంటే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లతో హీరో ఎలివేషన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. పూర్తిగా ఆపోజిట్ గా ఉండే వీరిద్దరి కాంబోలో మూవీ సెట్ అవుతుంది అనే వార్త అక్కినేని అభిమానులకు ఫీస్ట్ గా మారింది.

‘అఖండ 2’తో బోయపాటి బిజీ

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని బాలకృష్ణతో డైరెక్టర్ బోయపాటి ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ 2 : తాండవం’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ కోసం ఈగరుగా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. బోయపాటి ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. అయితే ‘అఖండ 2’లో బాలయ్యకి విలన్ గా ప్రముఖ తమిళ హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బోయపాటి తెరకెక్కించిన ‘సరైనోడు’ మూవీలో కూడా ఆది పినిశెట్టి విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.

కాంబో వర్కౌట్ అవుతుందా ?

‘అఖండ’ తర్వాత బోయపాటి ఖాతాలో హిట్ అనేది లేకుండా పోయింది. 2023లో ఆయన చేసిన ‘స్కంద’ మూవీ పెద్దగా ఆడలేదు. దీంతో మూవీ లవర్స్ బోయపాటి సినిమాలు కేవలం బాలయ్య కోసమే అనే కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలోనే బోయపాటి మెగాస్టార్ చిరంజీవితో నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. కానీ అంతలోనే అక్కినేని నాగచైతన్య పేరు తెరపైకి రావడంతో ఈ కాంబినేషన్ ఆసక్తికరంగా మారింది. మరి వీరిద్దరి కాంబో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారి తీసింది.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×