Sarpanch Post Auction: పంచాయితీ ఎన్నికలంటే పల్లెల్లో పోటీ మామూలుగా ఉండదు. పార్టీ గుర్తు ఉండకపోయినా, ఆయా పార్టీల మద్దతుతో అభ్యర్థులు బరిలోకి దిగుతుంటారు. సై అంటే సై అంటూ ప్రచారాలు నిర్వహిస్తారు. ప్రత్యర్థుల పోటీ పోటీ ప్రచారాలతో గ్రామాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినున్నట్లు ప్రభుత్వం నుంచి సంకేతాలు అందుతున్న నేపథ్యంలో సర్పంచ్ సీటు కోసం పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. ఎలాగైనా పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తున్నారు. కొన్ని చోట్ల ఏకంగా సర్పంచ్ పదవి కోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండలం గోకులపాడులో సర్పంచ్ సీటును వేలం వేశారు. ఓ యువకుడు ఏకంగా రూ. 27.50 లక్షలకు ఈ పదవి కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది.
గ్రామ పెద్దలంతా కలిసి సర్పంచ్ పదవికి వేలం
సర్పంచ్ ఎన్నికలు అంటే గ్రామాల్లో కొట్లాటలు జరుగుతాయి. ఇవన్నీ వద్దు అనుకున్న గోకులపాడు పెద్దలు హైటెన్షన్ వాతావరణం లేకుండా ప్రశాంతంగా సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించారు. సర్పంచ్ పదవి కోసం ఓ యువకుడు భారీ మొత్తంలో వేలం పాట పాడినట్లు తెలుస్తున్నది. ఒకటికాదు, రెండు కాదు, ఏకంగా రూ. 27.50 లక్షలకు సర్పంచ్ సీటును కొనుగోలు చేశాడు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకుండానే సర్పంచ్ పదవికి వేలం వేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఈ వ్యవహారం జోగుళాంబ గద్వాల జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
గోకులపాడులో 546 మంది ఓటర్లు
గోకులపాడు గ్రామంలో సమారు 1200 మంది జనాభా ఉంటుంది. 546 మంది ఓటర్లు ఉన్నారు. ఎలాంటి పంచాయితీలు లేకుండా ఈసారి పంచాయితీ ఎన్నికలు జరగాలని ఊరి పెద్దలు నిర్ణయించారు. అందులో భాగంగా సర్పంచ్ పదవిని ఏక్రగ్రీవం చేసేందుకు గ్రామ పెద్దల సంక్షంలో ఆదివారం నాడు వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో సుమారు 12 మంది ఆశావహులు పోటీ పడ్డారు. చివరకు ఓ యువకుడు అత్యధిక ధరకు వేలం పాట పాడి.. సర్పంచ్ పదవిని దక్కించుకున్నట్లు తెలుస్తున్నది.
Read Also: నెలకు రూ. 123 కోట్లు సంపాదిస్తున్న అమ్మాయిలు, ఛీ.. మరీ అలానా?
వేలం పాటపై గ్రామస్తులు ఏమంటున్నారంటే?
వాస్తవానికి సర్పంచ్ పదవి కోసం వేలం పాట నిర్వహించడం చట్ట విరుద్ధం. ఈ వ్యవహారంపై అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తున్నది. అయితే, ఈ వేలం పాట గురించి గ్రామస్తులు బయటకు చెప్పడం లేదు. గ్రామాభివృద్ధి, ఆలయ నిర్మాణాల కోసం వేలం పాట నిర్వహంచామని కొందరు చెప్తుంటే, అసలు వేలం పాటే జరగలేదని మరికొంత మంది చెప్తున్నారు. అయితే, వేలంలో వచ్చిన నగదుతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు నిర్ణయించారట. వేలం పాట నిర్వహించామని తెలిస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయని, అందుకే సైలెంట్ గా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
Read Also: భర్త ధనవంతుడంటూ బంధువులకు పంగనామాలు.. ‘ఫేక్ పెళ్లి చేసుకుని మరీ..
Read Also: మీకు తెలుసా? ఇండియాలో కోడిని చంపడం నేరం.. ఏ శిక్ష విధిస్తారంటే?