Big TV Kissik Talks Show : బిగ్ టీవీ(Big Tv) నిర్వహిస్తున్న కిసిక్ టాక్స్(కిస్స్ Talks) షో కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. జబర్దస్త్ వర్ష(Varsha) యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ వారి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నిస్తూ ఎన్నో విషయాలను రాబడుతున్నారు. ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు బిగ్ టీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం కాబోతున్న ఈ కార్యక్రమానికి తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ శుభశ్రీ రాయగురు(Subha Sree Rayaguru) హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన కెరీర్ గురించి అలాగే తన పెళ్లి గురించి కాబోయే వ్యక్తి గురించి తెలియజేశారు.
ప్రేమ వివాహం…
నిజానికి తాను “లా” చదివానని అనుకోకుండా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీ వైపు వచ్చానని శుభశ్రీ తెలియజేశారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె పలు సినిమాలలో నటిస్తూ బిగ్ బాస్ (Bigg Boss)అవకాశాన్ని అందుకున్నారు. ఇక బిగ్ బాస్ తర్వాత శుభశ్రీ ప్రవేట్ ఆల్బమ్స్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు అయితే ఇటీవల ఈమె నిర్మాత నటుడు అజయ్ మైసూర్ (Ajay Mysore)తో కలిసి ఒక సాంగ్ చేశారు. ఈ సాంగ్ షూటింగ్ సమయంలోనే తనతో పరిచయం ప్రేమ ఏర్పడిందని తెలిపారు. ఇక త్వరలోనే వీరిద్దరూ ఎంతో ఘనంగా వివాహం కూడా చేసుకోబోతున్న విషయం తెలిసిందే.
రొమాంటిక్ సీన్లకు దూరం…
ఇటీవల శుభశ్రీ అజయ్ మైసూర్ నిశ్చితార్థపు వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. వీరిద్దరూ దాదాపు తొమ్మిది నెలల పాటు ప్రేమలో ఉంటూ పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకోబోతున్నారు. సాధారణంగా వివాహం తర్వాత హీరోయిన్లు కానీ ఇతర సెలబ్రిటీలు కానీ సినిమాలలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. ఒకవేళ నటించినా ఎన్నో కండిషన్లు ఉంటాయి. అయితే శుభశ్రీకి కూడా ఇలాంటి కండీషన్లు ఉన్నాయని తెలుస్తోంది. ఈమె కాబోయే భర్త నటుడు నిర్మాత అయినప్పటికీ సినిమాల విషయంలో ఈమె కొన్ని నియమాలను పాటించబోతున్నారని ఇటీవల ఈ కార్యక్రమంలో తెలియజేశారు.
వర్ష శుభ శ్రీని ప్రశ్నిస్తూ ఒకవేళ సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలు, లిప్ కిస్ వంటి సీన్లు వస్తే శుభశ్రీ నటిస్తుందా? అంటూ ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నకు శుభశ్రీ సమాధానం చెబుతూ.. సినిమాలలో నటించడం ఓకే కానీ లిప్ కిస్, రొమాంటిక్ సన్నివేశాలు అంటే కుదరదని ఆమె తన చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగును చూపించారు. దీన్నిబట్టి చూస్తుంటే ఈమెకు సినిమాల విషయంలో కూడా కండిషన్లు ఉన్నాయని స్పష్టం అవుతుంది. నిశ్చితార్థం తర్వాతనే రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటానని చెబుతున్న శుభశ్రీ పెళ్లి తర్వాత కనీసం సినిమాలలో అయినా నటిస్తారా లేకపోతే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెబుతూ తన భర్త బాటలోనే నిర్మాణ రంగంలోకి అడుగు పెడతారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే శుభశ్రీకి మాత్రం బుల్లితెర కార్యక్రమాలు కంటే కూడా తనకు సినిమాలు అంటేనే ఇష్టమని తన మనసులో కోరికను బయటపెట్టారు.
Also Read: Manchu Brothers: కన్నప్పకు మనోజ్ రివ్యూ… విష్ణు రియాక్షన్ ఇదే.. మంచు వార్ ముగిసిందా?