Big TV Kissik Talks : ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే చాలా కష్టపడాలి అయితే కొంతమందికి అతి తక్కువ వయసులోనే ఇండస్ట్రీ లోకి వచ్చే అవకాశం వస్తుంది మరి కొంతమంది లేటుగా అయినా సరే అవకాశం దక్కించుకొని వరుస సినిమాలతో దూసుకుపోతూ ఉంటారు. అలాంటి వారిలో నటుడు మురళీధర్ గౌడ్ ఒకరు. ఈయన ఇటీవల సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ స్టార్ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఏడాదిలో రెండు మూడు ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. అయితే తాజాగా బిగ్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి సంచలన విషయాలను షేర్ చేసుకున్నాడు.. ఆ ఇంటర్వ్యలో ఆయన ఎలాంటి సినిమాలు షేర్ చేసుకున్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
కిసిక్ టాక్స్ ప్రోమో..
బిగ్ టీవీలో కిసిక్ టాక్స్ అనే పేరుతో ప్రారంభమయిన పోడ్కాస్ట్‌లో రెండో ఎపిసోడ్‌కు గెస్ట్‌గా బలగం నటుడు మురళీధర్ గౌడ్ వచ్చారు. ఆ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా బిగ్ టీవీ రిలీజ్ చేసింది. ఆ ప్రోమోలో యాంకర్ వర్షను మాట్లాడనివ్వకుండా ఓ ఆట ఆడుకున్నాడు. షో పేరు చెప్పగానే కిస్ నా అంటూ కామెంట్ చేశారు. అనంతరం ఆయన సినిమాల గురించి కీలక విషయాలను షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా మ్యాడ్ 2 లోని హైలెట్ సీన్ ను వర్షతో చేశారు. ఆ సీన్ ఎపిసోడ్ కు హైలెట్ అవ్వనుందని తెలుస్తుంది. వీరిద్దరి మధ్య సంభాషణ కాస్త కామెడీగా అందరిని ఆకట్టుకుంటుందని ప్రోమోను చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: సాయి పల్లవికి బిగ్ షాక్.. మళ్లీ అదే రిపీట్..!
సంక్రాంతికి వస్తున్నాం మూవీలో నటించి బాధపడ్డాను..
ఈయన ఇటీవల నటించిన మూవీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ. ఈ మూవీ గురించి వర్ష అడిగింది. ఈ మూవీ సూపర్ హిట్ అయింది కదా ఈ మూవీలో నేను నటించడం మీకు ఎలా ఉంది అంటే మీరు ఎలా ఫీలయ్యారు అని వర్ష అడిగింది. ఈ మూవీని ఎందుకు చేసానో అని బాధపడ్డానని మురళీధర్ చెప్పి షాక్ఇచ్చాడు. అదేంటి ఈ సినిమా బాగా హీట్ అయింది కదా మరి మీరు ఎందుకు ఇలా అంటున్నారు అని వర్ష అడిగితే.. దానికి ఆయన టక్కున సమాధానం చెప్పాడు. ఏమైంది ఎందుకు అలా చెప్పారని అడిగితే.. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్ సినిమాలో నన్ను డాడీ అంటుంది. అటు మీనాక్షి చౌదరి ఏమో నన్ను బాబాయ్ అని పిలుస్తుంది అందుకే నాకు బాధగా అనిపించింది ఈ సినిమాని ఎందుకు చేశాను అని చాలా ఫీల్ అయ్యాను అంతే ఫన్నీ గా సమాధానం చెప్పాడు మురళీధర్ గౌడ్.
ఈయన సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం మ్యాడ్ స్క్వేర్ మూవీలో నటిస్తున్నాడు. దీంతోపాటు మరికొన్ని ప్రాజెక్టులలో నటిస్తున్నారు..