BigTV English

Miss World 2025: మిస్‌ వరల్డ్‌ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం.. మే ఫస్ట్ వీక్ నుంచి హైదరాబాద్‌లో అందగత్తెలు

Miss World 2025: మిస్‌ వరల్డ్‌ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం.. మే ఫస్ట్ వీక్ నుంచి హైదరాబాద్‌లో అందగత్తెలు

Miss World 2025: మిస్‌ వరల్డ్‌-2025 పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి తెర వెనుక ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.మే 7 నుంచి 31 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ‘తెలంగాణకు తప్పక రండి’ అనే నినాదంతో రెడీ అవుతోంది.


మిస్‌ వరల్డ్‌-2025 పోటీలకు హైదరాబాద్ రెడీ

ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి అందగత్తెలు భాగ్యనగరానికి తరలి రానున్నారు. మే 10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభోత్సవం జరగనుంది. అదే నెల 31న ముగింపు వేడుకలు హైటెక్స్‌లో జరగనున్నాయి. మధ్యలో తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసే విధంగా వివిధ ప్రాంతాల్లో రకరకాల ఈవెంట్లు నిర్వహించనున్నారు.


 పోటీల పోస్టర్‌ ఆవిష్కరణ

గురువారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో 72వ ఎడిషన్‌ మిస్‌ వరల్డ్‌ పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అలాగే తెలంగాణ పర్యాటక శాఖ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. గతేడాది మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా పిజ్కోవా ఈ కార్యక్రమానికి పోచంపల్లి చీర కట్టుతో దర్శనమిచ్చింది. మిస్‌ వరల్డ్‌ పోటీల నిర్వాహకులు-రాష్ట్ర పర్యాటక-సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.

పోటీల్లో పాల్గొనే వివిధ దేశాల యువతులు మే 6 నుంచి 7 వరకు హైదరాబాద్‌‌కు చేరుకుంటారు. 12న నాగార్జున సాగర్‌లోని బుద్ధవనం, 13న హైదరాబాద్‌ చార్మినార్, లాడ్‌బజార్‌లకు, 14న వరంగల్‌లోని కాళోజీ కళాక్షేత్రానికి, రామప్ప ఆలయానికి, 15న యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లికి అందగత్తెలను నిర్వాహకులు తీసుకెళ్తారు. మే 16 నుంచి 26 వరకు హైదరాబాద్‌లో పలు కార్యక్రమాలు జరగనున్నాయి.

ALSO READ: మెట్రోకు బెట్టింగ్ యాప్ సెగ, రాత్రికి రాత్రి దిద్దుబాటు చర్యలు

మిస్‌ వరల్డ్‌ పోటీల పోస్టర్‌ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. మిస్‌వరల్డ్‌ పోటీలను అట్టహాసంగా నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఇదొక మంచి అవకాశం వర్ణించారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఈ పోటీలను హైదరాబాద్‌లో జరిగేలా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌తోపాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ఈవెంట్‌కు అయ్యే ఖర్చును నిర్వాహకులు-ఆతిథ్య రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్నారు. మొత్తం రూ. 54 కోట్ల కాగా, అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.27 కోట్లు భరించాల్సి ఉంది. పర్యాటక శాఖ రూ.5 కోట్లు ఇవ్వనుంది. మిగతా రూ.22 కోట్లను టూరిజం కార్పొరేషన్‌ స్పాన్లర్ల ద్వారా సేకరిస్తుందని తెలియజేశారు.

ప్రపంచ సుందరి క్రిస్టినా మాటలు

భారతదేశానికి రాగానే తనకు చాలా గొప్పగా స్వాగతం పలికారని చెప్పారు ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా. నమస్తే ఇండియా అంటూ ఈ అందగత్తె తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన ప్రయాణానికి ఇండియానే వేదికని గుర్తు చేశారు. గతేడాది ముంబైలో జరిగిన 71వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో విజేతగా నిలిచానని తెలిపింది.

ఈ దేశ సంస్కృతి, కళలు ఎంతో గొప్పగా ఉన్నాయని మనసులోని మాట బయటపెట్టింది. తెలంగాణకు వచ్చాక యాదగిరిగుట్టకు వెళ్లానని, అక్కడ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించడం మంచి అనుభూతిని ఇచ్చిందని తెలిపింది. ఈ జర్నీ తనకు ఎప్పటికీ గుర్తు ఉండిపోతుందన్నది క్రిస్టినా మాట.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×