OTT Movie : పేదవాళ్ళకి ఒక న్యాయం, డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం అన్నట్టు గానే ఉంది ఈ ప్రపంచం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక మైనర్ బాలిక పై, రాజకీయ నాయకుడి కొడుకు అఘాయిత్యం చేస్తాడు. ఆమె కోసం తన అమ్మమ్మ రివేంజ్ తీర్చుకోవాలి అనుకుంటుంది. ఈ క్రమంలోనే మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో
2017 లో రిలీజ్ అయిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అజ్జీ’ (Ajji). దీనికి దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సుషమా దేశ్‌పాండే, శర్వాణి సూర్యవంశీ, అభిషేక్ బెనర్జీ, సదియా సిద్ధిఖీ, వికాస్ కుమార్, మనుజ్ శర్మ, సుధీర్ పాండే, కిరణ్ ఖోజే, స్మితా తాంబే ప్రధాన పాత్రలు పోషించారు. ‘అజ్జీ’ అనే ఈ స్టోరీ ‘రెడ్ రైడింగ్ హుడ్లో’ డార్క్ టేక్‌గా ఉంచబడింది. ఈ మూవీ బ్యూన్ ఇంటర్నేషనల్ థ్రిల్లర్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్రాన్స్ ఫ్రెష్ బ్లడ్ పోటీలో అవార్డును కూడా గెలుచుకుంది. ‘అజ్జీ’ పాత్ర పోషించిన సుషమా దేశ్‌పాండే UK ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ది ఫ్లేమ్ అవార్డును గెలుచుకుంది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజెల్స్‌లో, ఆమె నటనకు ప్రత్యేక జ్యూరీ ప్రస్తావన వచ్చింది. 2017 బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పోటీ చేయడానికి ‘అజ్జీ’ని అధికారికంగా ఆహ్వానించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ ఒక పేద స్లమ్ ప్రాంతంలో జరుగుతుంది. మందా అనే 10 ఏళ్ల చిన్న పాప తన అమ్మమ్మ అజ్జి తో కలిసి జీవిస్తుంది. ఒక రోజు, మందా అనుమానాస్పదంగా అదృశ్యమవుతుంది. అజ్జి, స్థానిక వేశ్య లీలా ఆమెను వెతుకుతూ ఉంటారు. చివరకు ఆమెను చెత్త కుప్పలో గాయాలతో, అత్యాచారానికి గురైన స్థితిలో కనుగొంటారు. మందా తల్లిదండ్రులు ఈ దారుణ ఘటనను ఎదుర్కోలేక, జీవనోపాధి కోసం దాన్ని మరచిపోవాలని నిర్ణయిస్తారు. అయితే, ఆమెను రక్షించడానికి పోలీసులు కూడా సహాయం చేయలేరు. తిరిగి వాళ్ళమీదే కేసులు పెడతామని అనడంతో, ఆ ఫ్యామిలీ భయపడుతుంది. ఎందుకంటే ఆ పని చేసిన ధవ్లే ఒక శక్తివంతమైన స్థానిక రాజకీయ నాయకుడి కొడుకు. పోలీసులు అతని ప్రభావంలో ఉండి, కేసును మూసివేయమని కుటుంబాన్ని బెదిరిస్తారు.
ఈ అన్యాయాన్ని సహించలేని అజ్జి, వృద్ధాప్యం ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ, తన చిన్నారి మనవరాలికి న్యాయం చేయాలని నిర్ణయిస్తుంది. ఆమె ధవ్లేను గమనిస్తూ, అతని కదలికలను గుర్తిస్తూ, ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక పథకం రచిస్తుంది. ఒక స్థానిక కసాయి వద్ద మాంసం కోయడం నేర్చుకుంటూ, ఆమె తన ప్రతీకారాన్ని క్రమంగా అమలు చేస్తుంది. చివరకు, ఆమె ధవ్లేను భయంకరమైన రక్తపాతంతో కూడిన ముగింపుతో శిక్షిస్తుంది. ఈ మూవీని మీరుకూడా చూడాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో అందుబాటులో ఉంది.