E-Paper
Advertisement

Kissik Talks Show : మనోడు ప్రేమలో పడ్డాడురోయ్.. ఆ అమ్మాయితోనే పెళ్లి..?

Kissik Talks Show : మనోడు ప్రేమలో పడ్డాడురోయ్.. ఆ అమ్మాయితోనే పెళ్లి..?
Advertisement

Kissik Talks Show : ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ బిగ్ టీవీ ఎప్పటికప్పుడు జనాలని ఆకట్టుకునే విధంగా వార్తలను ప్రసారం చేస్తూ ఉంటుంది.. నిరంతరం వార్తలు మాత్రమే కాదు.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు కొన్ని స్పెషల్ ప్రోగ్రాంలను కూడా నిర్వహిస్తూ వస్తుంది.. ఈమధ్య కొత్తగా కిస్సిక్ టాక్స్ అనే ప్రోగ్రాం ను స్టార్ట్ చేసింది. ఆ ప్రోగ్రాంకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికీ కార్యక్రమానికి చాలామంది సెలబ్రిటీలు కూడా రావడంతో ఎక్కువ మంది ఈ షో ని చూసేందుకు ఇంత చూపిస్తున్నారు.. దీనికి జబర్దస్త్ యాక్టర్ వర్షా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల గెస్ట్ గా వచ్చారు. ఆయన ఎన్నో విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. కళ్యాణ్ ఎలాంటి విషయాల గురించి చర్చించారో ఒకసారి తెలుసుకుందాం..

కళ్యాణ్ ప్రేమలో పడ్డారా..?

స్టార్ మా లో ప్రసారమైన టాప్ రియాలిటీ షోలోకి అగ్నిపరీక్ష ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.. కామన్ మాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను తన ఆటతో మాటతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ సీజన్ 9 కు విన్నర్గా నిలిచాడు. ఈ షో కి విన్నర్ అయిన తర్వాత కళ్యాణ్ పడాలా ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత పలు స్పెషల్ కార్యక్రమాలకి అలాగే ఎన్నో షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కూడా చేశాడు.. అలాంటి కళ్యాణ్ తాజాగా బిగ్ టివి నిర్వహించిన కిస్సిక్ టాక్స్ ప్రోగ్రాంకు గెస్టుగా వచ్చారు. తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్న కళ్యాణ్ తన జీవితంలో ఒక అమ్మాయి ఉంది అని బయట పెట్టేస్తాడు.. యాంకర్ వర్షా ఎంతగా ఆ అమ్మాయి గురించి చెప్పిన సరే.. కళ్యాణ్ మాత్రం ఆయన ఎవరూ అన్న విషయాన్ని బయట పెట్టలేదు.. ఇక దాంతో వర్ష మనోడు ఆల్రెడీ బుక్ అయ్యాడు రో అంటూ అరిచేస్తుంది..

పెళ్లి ఎప్పుడంటే..? 

Advertisement

కళ్యాణ్ పడాల తన లవ్ స్టోరీ గురించి బయట పెట్టాడు కానీ ఆ అమ్మాయి ఎవరు అన్న విషయం మాత్రం ఎంతగా అడిగినా సరే బయట పెట్టలేదు. దాంతో అందరూ అమ్మాయి తనూజని అని అనుకున్నారు. కానీ తనుజ కేవలం ఫ్రెండ్ అని చెప్పగానే ఇంతకీ కళ్యాణ్ మనసులో ఉన్న అమ్మాయి ఎవరు అని అందరూ ఇప్పుడు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఏది ఏమైనా కూడా తల్లి అని ప్రేమలో పడ్డాడు అన్న విషయం ఆయన ఫ్యాన్స్ కి సంతోషాన్ని ఇచ్చింది.. మరి ఆ అమ్మాయితోనే తన జీవితం అని చెప్పడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు ఏమో అని ఓ వార్త ప్రస్తుతం షికారు చేస్తుంది.. ఏదేమైనా కూడా కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి భర్తగా పొందిన అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం ఈ షో ఎపిసోడ్ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. కళ్యాణ్ ఇంకా ఎలాంటి విషయాలు గురించి బయటపెట్టాడు అన్నది ఈ ఎపిసోడ్లో ఒకసారి చూసేయాల్సిందే..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×