E-Paper
Advertisement

ఎట్టకేలకు యుద్ధం ముగిసింది.. ఇరాన్-అమెరికా మధ్య డీల్, ట్రంప్ కీలక ప్రకటన, జలసంధి ఓపెన్

ఎట్టకేలకు యుద్ధం ముగిసింది.. ఇరాన్-అమెరికా మధ్య డీల్, ట్రంప్ కీలక ప్రకటన, జలసంధి ఓపెన్
Advertisement

Trump: ఎట్టకేలకు ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ఆగిపోయింది. దాదాపు 100 రోజుల తర్వాత రెండు దేశాలు ఆదివారం ఒప్పందం జరగనుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోలాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటన చేశారు. దీంతో హోర్మూజ్ జలసంధి ఎప్పటి మాదిరిగా తెరుకోనుంది. ఈ విషయం తెలియగానే ముఖ్యంగా ఆసియా దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.

యుద్ధం ముగిసింది.. ఇరాన్-అమెరికా మధ్య ఆదివారం ఒప్పందం

Advertisement

మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని చాన్నాళ్లుగా ఎదురుచూస్తోంది అమెరికా. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్‌ మద్య చారిత్రాత్మక ఒప్పందం ఆదివారం జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఇరుదేశాల మధ్య సంతకాలు తర్వాత వెంటనే హర్మూజ్‌ జలసంధి తెరుచుకుంటుందని వెల్లడించారు. ఈ మేరకు తన ట్రూత్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు.

అదే సమయంలో ఇరాన్‌ విషయంలో ఆనాటి ఒబామా సర్కార్ తీసుకున్న నిర్ణయాలు తప్పుబట్టారు ట్రంప్. ఇరాన్‌తో ఒబామా మధ్య ఉమ్మడి సమగ్ర కార్యాచరణ పేరిట ఒప్పందం జరిగిందని, దానివల్ల ఆదేశం అణ్వాయుధం తయారీకి బాటలు పరిచిందన్నారు. ఆనాటి ఒప్పందం అమల్లో ఉండింటే ఆరేళ్ల కిందట ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసి ఉండేదన్నారు.

Advertisement

ప్రస్తుతం ఇరాన్‌తో తాము కుదుర్చుకుంటున్న ఒప్పందం దీనిని పూర్తి విరుద్ధమని రాసుకొచ్చారు. ఇరాన్‌ అణ్వాయుధ కలను నాశనం చేసే ఒప్పందమని పేర్కొన్నారు. అభివృద్ధి ద్వారా వాళ్ల లక్ష్యం నెరవేరకుండా ఒప్పందం చేస్తుందన్నారు. ఆదివారం చారిత్రాత్మక ఒప్పందం జరగబోతోందని, సంతకాలు పూర్తి కాగానే హార్మూజ్‌ జలసంధింని తెరుస్తామన్నారు.

ట్రంప్ కీలక ప్రకటన, హ్మూరూజ్ జలసంధి ఇకపై ఓపెన్

ఒప్పందం తర్వాత ఇరాన్‌తో మా బంధం గతం కంటే భిన్నంగా ఉంటుందన్నారు. ఆనాడు ఒబామా వందల బిలియన్ల డాలర్లను పెట్టుబడులు, ఒప్పందాలు, నగదు రూపంలో ఇరాన్‌‌కు ఖర్చు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము అదనుచూసి గుట్టు చప్పుడుకాకుండా ఇరాన్‌ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోగలిమన్నారు.

బీ–2 బాంబర్‌ విమానాలతో ఇరాన్‌ పర్వతాల్లో రేడియో ధార్మిక పదార్థాన్ని నాశనం చేశామని, ఇరాన్‌తో పశ్చిమాసియా పని చేయాలనుకుంటున్నామని ప్రస్తావించారు. ఇరాన్‌తో ప్రక్రియ వేగంగా సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నమని, ఒకవేళ ఆచరణ సాధ్యంకాకుంటే భయంకరమైన ప్రత్యామ్నాయం ఉందని చెప్పకనే చెప్పారు.

ALSO READ: కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం.. ప్రముఖ కాఫీ షాప్‌నకు భారీ షాక్.. రూ.4 లక్షల ఫైన్!

మరోవైపు అమెరికాతో ఒప్పందంపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. లెబనాన్‌ సహా అన్నిప్రాంతాల్లో యుద్ధం ముగించే ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు తెలిపారు. ఇరాన్‌ అణు కార్యక్రమం లేదని, ప్రాథమిక ఒప్పందం కుదిరిన రెండు నెలల తర్వాత అణ్వాయుధాల అంశంపై చర్చలు జరుగుతాయని వెల్లడించింది.

ట్రంప్ ప్రకటన ఒకలా, ఇరాన్ స్టేట్‌మెంట్ మరొలా ఉంది.
ఇదిలాఉండగా సుప్రీం నేత అలీ ఖమేనీ అంత్యక్రియల ఉరేగింపులు జూలై 4న టెహ్రాన్‌లో ప్రారంభమవుతాయని ఇరాన్‌ వెల్లడించింది. 9న మషహద్‌ నగరంలోని ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Related News

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. తీవ్రత 7.1 గా నమోదు, వందలాది బుల్లెట్ రైళ్లు రద్దు

13 రోజుల బాంబుల వర్షం తర్వాత క్లైమాక్స్… ట్రంప్ నిర్ణయంతో మారిపోయిన సీన్!

సిరియాలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, 35 మంది మృతి, 30 మందికి పైగానే గాయాలు

కెనడాలోనూ ఉన్మాదమే.. ప్రేయసిని చంపిన ఇండియన్ ప్రియుడు.. ఏం జరిగిందంటే?

ఒకే ఇంట్లో భార్యాభర్తలు.. కానీ 20 ఏళ్లుగా మాటలు కట్.. ఎందుకో తెలిస్తే షాక్!

1100 రోజులుగా జైల్లోనే ఇమ్రాన్ ఖాన్.. ‘మిస్ యూ డాడీ’ అంటూ.. కుమారుడు ఆసక్తికర పోస్ట్!

Big Stories

Advertisement
×