Big TV Kissik Talks : బుల్లితెర సీరియల్ నటులు, లవ్ బర్డ్స్ అమర్ దీప్, తేజస్విని పరిచయం అక్కర్లేదు.. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోను అద్భుతమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. సీరియల్స్ లో నటించే పాత్రల ద్వారా కాక నిజజీవితంలో వారి ప్రేమ కథ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు అమర్, తేజు. అమర్ జానకి కలగనలేదు, ఉయ్యాల జంపాల సీరియల్ తో పరిచయమై బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని ఎన్నో వివాదాలలో నిలిచినా, తేజస్విని, ఆయన అభిమానులు సపోర్ట్ తో బయటపడగలిగారు. తెలుగు, తమిళ భాషలలో బుల్లితెర రంగంలో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న తేజస్విని మోడలింగ్ తో తన కెరీర్ ను ప్రారంభించి.. సీరియల్స్ లో నటిస్తూ మంచినటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కోయిలమ్మ సీరియల్, కేరాఫ్ అనసూయ, తమిళంలో విద్యా నెంబర్1 సీరియల్స్ లో నటించింది. అమర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సీరియల్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చింది. అమర్ తో కలిసి డాన్స్ షోలు చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. తాజాగా ఈమె బిగ్ టీవీ కిస్సక్ టాక్ షో లో జబర్దస్త్ వర్ష తో కలిసి ముచ్చటించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో అమర్ తో విడాకుల గురించి వచ్చిన రూమర్స్ పై తేజు ఏమందో ఇప్పుడు చూద్దాం..
విడాకుల రూమర్స్ ఫై స్పందించిన తేజు ..
వర్ష తేజస్వినితో, అమర్ కి తేజు దొరకడం లక్కా.. తేజుకి అమర్ దొరకడం లక్కా అని అడగ్గా ..తేజు నవ్వుతూ తను దొరకడం నా అదృష్టం అని చెప్తూ ఉంటాడు. ఏ షో కి వెళ్ళినా అలానే చెప్తాడు. కానీ ఇంట్లో మాత్రం నువ్వు దొరకడం నా అదృష్టం. నేను దొరకడం నీ అదృష్టం అని అంటాడు అని తెలిపింది.
మీరు ఎప్పుడైనా ఎవరికైనా వార్నింగ్ ఇచ్చారా అని వర్ష తేజు ని అడగ్గా.. నేను వార్నింగ్ అయితే ఇచ్చాను అని అంటుంది. అమర్ మన సుమ గారితో ఒక కుకింగ్ షో చేస్తున్నారు. ఇంట్లో కూడా వంట చేస్తాడా అని వర్షా అంటే, లేదు ఇంట్లో అసలు వంటింటి వైపే రాడు. ఆ షోలో చాలా బాగా చేస్తావు కదా అని అడిగితే ఏదో అలా చేసేస్తా అని చెప్తాడు. ఇంట్లో అయితే వంట చేయదు అని తేజు అంటుంది.
మీ జంటని చూసి అంతా చాలా బాగున్నారు. చాలా చూడముచ్చటగా ఉన్నారు అని అంటారు కానీ, అమర్ కి తేజు త్వరలో విడాకులు ఇస్తుంది అన్నది నిజమేనా అని వర్షా అడగ్గా.. తేజు మాట్లాడుతూ ఏ భార్యాభర్తల మధ్య అయినా గొడవ అనేది కామన్ గా ఉంటుంది. మా మధ్య గొడవ లేదు అని నేను చెప్పడం లేదు. ఇప్పుడున్న జనరేషన్స్ కొంతమంది అందరూ కాదు, ఒకరితో లవ్ లో ఉండి మళ్ళీ వేరే వాళ్ళు వాళ్ళ లైఫ్ లోకి వచ్చిన తర్వాత వాళ్లతో కనెక్ట్ అవుతూ ఉంటారు కదా .. దానిపై మీ అభిప్రాయం అని వర్ష అంటే.. తేజు కర్మ ఎలా వస్తుందో మనకి తెలియదు. ఏ రూపంలో వచ్చైనా ఇబ్బంది పెడుతుంది అని తెలిపింది.
శుభవార్తని చెప్పిన తేజు ..
ఈరోజు సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయం గురించి చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మాయి అయితే చాలు నేరాలు చేస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు అని వర్షా అడగ్గా.. తేజు స్పందిస్తూ పెద్ద వాళ్ల గురించి పక్కన పెడితే.. చిన్న పిల్లలని చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉంటాం. అలాంటి చిన్న పిల్లల్ని తీసుకువెళ్లి అసలు ఎలా అలా బిహేవ్ చేస్తారో నాకు అసలు అర్థం కాదు అని తెలిపింది .
అమర్ నిన్ను ఎక్కువ ప్రేమిస్తాడా.. నువ్వు అమర్ ని ఎక్కువ ప్రేమిస్తావా అంటే.. అమర్ ని నేను ఎక్కువ ప్రేమిస్తాను. ఎంత ప్రేమ ఉంటే అంత అనుమానం కూడా ఉంటుంది. అది అమర్ కే తెలుసు. మొత్తానికి తేజు ఈ షోలో అమర్ పై తన ప్రేమను తెలిపింది. ఈ షో ద్వారా తను ప్రెగ్నెంట్ అన్న శుభవార్తని అభిమానులకు చెప్పింది.