Klaasen: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament )… గురువారం రోజున ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల ( Mumbai Indians vs Sunrisers Hyderabad ) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దారుణంగా ఓడిపోయింది. 4 వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టును చిత్తు చేసింది ముంబై ఇండియన్స్. బ్యాటింగ్ అలాగే బౌలింగ్లో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్.. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
Also Read: Backfoot No Ball: వివాదంగా మారిన స్టార్క్ నో బాల్…. అంబానీ కుట్రలు చేశాడని ఆరోపణలు
కాటేరమ్మ కొడుకు చేసిన చెత్త పని
హైదరాబాద్ జట్టు కాటేరమ్మ కొడుకు క్లాసెన్ ( Klasen )… చేసిన ఓ చెత్త పని కారణంగా… ముంబై ఓపెనర్ రికెల్టన్ అవుట్ అయినప్పటికీ… మళ్లీ బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్ ఏడో ఓవర్ లో… రికెల్టన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ ప్లేయర్ జీసన్ అన్సారి బౌలింగ్ వేశాడు. అయితే.. అన్సారి వేసిన బంతిని… గట్టి షాట్ ఆడాడు రికెల్టన్. ఆ బంతిని హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అద్భుతం గా అందుకున్నాడు. అయితే అదే సమయంలో… వికెట్ల వెనుక ఉన్న క్లాసెన్…. వికెట్ల కంటే ముందు తన గ్లౌజు పెట్టి హైదరాబాద్ కొంపముంచాడు. అలా వికెట్ల కంటే ముందు చేతులు పెడితే… నో బాల్ గా ప్రకటిస్తారు. రికెల్టన్ వికెట్ లో కూడా ఇదే జరిగింది.
నో రూల్స్ ఏంటి ?
వాస్తవానికి.. 27.3.2 క్రికెట్ రూల్స్ ప్రకారం… బంతి బౌలర్ చేతుల నుంచి రిలీజ్ కాకముందు… వికెట్ కీపర్ తన చేతులను… వికెట్ల కంటే ముందు పెట్టకూడదు. బౌలర్ చేతి నుంచి బంతి రిలీజ్ అయిన తర్వాత.. వికెట్ కీపర్ ఏమైనా చేసుకోవచ్చు. అలా కాదని బంతి పడకముందే చేతులు వికెట్లకు ముందుగా… పెడితే నో బాల్ గా ప్రకటిస్తారు. అలాగే వికెట్ కీపర్ కు వార్నింగ్ కూడా ఇస్తారు అంపైర్. ఆ తర్వాత.. ఫ్రీ హిట్ ఉంటుంది. కానీ క్రికెట్ రూల్స్ క్లాసెన్ బ్రేక్ చేశాడు. అయితే రికెల్టన్… బతికి బయటపడినప్పటికీ… ఆ తర్వాత హర్షల్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.
హైదరాబాద్ పై ముంబై గ్రాండ్ విక్టరీ
ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో… ఐదు వికెట్లు నష్టపోయి 162 పరుగులు మాత్రమే చేసింది. ముంబై పిచ్.. చాలా స్లోగా ఉంది. అందుకే హైదరాబాద్ ప్లేయర్లు పరుగులు చేసేందుకు చాలా కష్టపడ్డారు. దింతో తక్కువ స్కోరు మాత్రమే చేసింది హైదరాబాద్. ఈ మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో ముంబై గెలిచింది. హైదరాబాద్ ఇచ్చిన లక్ష్యాన్ని… 18 ఓవర్లలోనే ఫినిష్ చేసింది ముంబై.
Also Read: Match Fixing threat IPL 2025: ఐపీఎల్ 2025 ఫిక్సింగ్ బాంబు.. హైదరాబాద్ వ్యక్తినే కీలక సూత్రదారి
What are your views on Varun Chakravarthy's Post..✍🏻 pic.twitter.com/320KPIuqeY
— RVCJ Media (@RVCJ_FB) April 17, 2025