Big twist in Raj Tarun and Lavanya case: హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. రోజుకో మలుపు తిరుగుతుంది. ఇటీవల లావణ్య రాజ్ తరుణ్‌పై తన సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్ తో ఎపైర్ పెట్టుకుని తనను వదిలేసాడని ఆరోపించింది. నిన్న మొన్నటి వరకు ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాడని, తనని ప్రెగ్నెంట్ కూడా చేశాడని, అబార్షన్ చేయించాడని, వదిలించుకోవడానికి కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించాడని, రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్లి పోయి తనకు దూరంగా ఉంటున్నాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. ఇక లావణ్య ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఇటీవల కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ పై లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని.. 10 ఏళ్లుగా వీరిద్దరు సహజీవనం చేసినట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు రాజ్ తరుణ్ ను నిందుతుడిగా నిర్ధారించారు.
రాజ్ తరుణ్-మాల్వి కలిసి దొంగతనం చేశాడంటూ ఆరోపణలు.
ఇదిలా ఉంటే.. లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలో కీలక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా లావణ్య ఇంట్లో చోరీ జరిగింది. సుమారు 12 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు పలు డాక్యుమెంట్లు చోరీకి గురైనట్టు తెలిపారు లావణ్య.
ఈ చోరీపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు ఆమె. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రపైనే అనుమానం ఉన్నట్టు తెలిపారు. తాను జైలుకు వెళ్లక ముందు ఇంటి తాళం తన వద్దే ఉన్నట్టుగా తెలుపారు. తనకు ఎలాంటి ఆధారాలు లేకుండా తాళిబొట్టుతో సహా పలు ఆభరణాలు, డాక్యుమెంట్లు కూడా తీసుకొని వెళ్ళినట్టు లావణ్య తెలిపారు. రెండు రోజుల క్రితం ముంబైకి వెళ్లి రాజ్ తరుణ్ దగ్గర నుంచి తాళం తీసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో చూసే సరికి బంగారు ఆభరణాలతో పాటు డాక్యుమెంట్లు కూడా లేకపోవడంతో షాక్‌కు గురైనట్టు లావణ్య తెలుపుతున్నారు.
Also Read: పదేళ్లు సహజీవనం.. హీరో రాజ్ తరుణ్ నిందితుడే!
మూడో వ్యక్తి వెళ్లి బీరువా ఓపెన్ చేసే ప్రసక్తి ఉండదు కాబట్టి ఇది ఖచ్చితంగా తెలిసిన వాళ్లే మాల్వి మల్హోత్ర, రాజ్ తరుణ్ కలిసి చేసుంటారని లావణ్య పేర్కొంది. ఎప్పుడైతే మా జీవితాల్లోకి మాల్వి మల్హోత్ర ఎంట్రీ అయ్యిందో అప్పటి నుంచి రాజ్ తరుణ్‌కు నాకు మనస్పర్ధలు వచ్చాయి. అప్పటి నుంచి మాకు ఈ రకమైన గొడవలకు దారితీసిందని ఆరోపించింది. దీంతో నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.