EPAPER

Devara Trailer Telugu: ‘దేవర’ ట్రైలర్ వేరే లెవెల్.. గూస్‌బంప్స్ వచ్చాయంతే

Devara Trailer Telugu: ‘దేవర’ ట్రైలర్ వేరే లెవెల్.. గూస్‌బంప్స్ వచ్చాయంతే

Devara Trailer Released: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ‘దేవర’ పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఒక్క తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ దేశ సినీ ప్రియులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా నుంచి రిలీజ్ అవుతున్న అప్డేట్‌లను బాగా వైరల్ చేస్తున్నారు. ఏ ఒక్క అప్డేట్‌ని మిస్ చేయడం లేదు. చిన్న ఫోటో లీక్ అయినా.. అది సోషల్ మీడియాలో పరుగులు పెడుతుంది.


దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ కాంబో ఇప్పుడు మళ్లీ సెట్ అవడంతో ‘దేవర’పై బోలెడు అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో స్టార్ కాస్టింగ్ నటిస్తుంది. ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, మూడు సాంగ్స్ సినీ ప్రియులు, అభిమానుల్లో ఊహకందని అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో ఎన్టీఆర్ మాస్ లుక్, యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉన్నాయనే చెప్పాలి. సముద్ర తీరంలో విలన్‌లను వేటాడుతున్న తీరు అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.


Also Read: అలియా, కరణ్ జోహార్‌లను నమ్ముకున్న ఎన్టీఆర్.. ఇక ‘దేవర’ను లేపే బాధ్యత వాళ్లదే!

గ్లింప్స్‌తో హైప్ అమాంతంగా పెంచేసిన మేకర్స్.. ఆ తర్వాత ఫియర్ సాంగ్‌తో మరింత బజ్ క్రియేట్ చేశారు. అలాగే మొదటి అప్డేట్‌లతోనే క్యూరియాసిటీ పెంచేయడంతో ఇంకా ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్‌ల కోసం అభిమానులు ఎదురుచూశారు. అలాంటి సమయంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరో రెండు సాంగ్‌లను మేకర్స్ వదిలారు. ఈ రెండు సాంగ్‌లకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్స్ యూట్యూబ్‌లో సంచలన వ్యూస్‌తో పరుగులు పెట్టాయి. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన ‘దావుదీ’ సాంగ్‌కి అయితే వీరమాస్ లెవెల్లో వ్యూస్, లైక్స్ వచ్చాయి.

ఇలా ప్రతి అప్డేట్‌తో సినీ ప్రియుల్లో ఆసక్తి పెంచేసిన మేకర్స్ ఇప్పుడు మరో దుమ్ము దులిపే అప్డేట్‌ను ఇవాళ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ‘దేవర’ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. అందువల్ల రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఇందులో భాగంగానే ఇవాళ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఎన్టీఆర్ లుక్స్ ఓ లెక్క.. ఈ ట్రైలర్‌లో ఉన్న ఎన్టీఆర్ లుక్, స్వాగ్ మరో లెక్క అనే చెప్పాలి. మాస్ యాక్షన్, రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫైట్ సీన్లు అబ్బో ఓ రేంజ్‌లో ఉన్నాయనే చెప్పాలి. మొత్తంగా ఈ ట్రైలర్‌తో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందనే చెప్పాలి. మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి.

Related News

Vettaiyan : నటీనటుల రెమ్యునరేషన్ ఎంతంటే.. ఎవరికి ఎక్కువ అంటే..?

Sarangapani Jathakam : ‘సారంగపాణి’ జాతకం కాదు… ముందు ఇంద్రగంటి, దర్శిల జాతకం మారాలి

SD18 : సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది..స్పెషల్ వీడియోతో ట్రీట్ అదిరింది మామా…

Shraddha Kapoor: పెళ్లిపై ఊహించని కామెంట్స్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. గంతకు తగ్గ బొంతే..!

Sandeep Reddy Vanga With RGV : రెండు సినిమా పిచ్చి ఉన్న జంతువులు, అనిమల్ పార్కులో కలిసాయి

Aadhi Sai Kumar: కెరియర్ లో ఉన్నది ఒకటే హిట్ సినిమా, అదే మళ్లీ రీ రిలీజ్

Ram Charan: నేను నా ప్రొడ్యూసర్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నా సినిమా పోస్టర్స్ మీద కలెక్షన్స్ వేయకండి

Big Stories

×