Raj Tharun-Lavanya Case Update: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. తాజాగా, ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్‌పై లావణ్య చేసిన ఆరోపణలో నిజం ఉందని తేల్చి చెప్పారు. ఈ మేరకు హీరో రాజ్ తరుణ్ నిందితుడేనని పోలీసులు నిర్ధారించారు.
హీరో రాజ్ తరుణ్, కోకాపేటకు చెందిన లావణ్యలు పదేళ్లు సహజీవనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిద్దరూ పదేళ్లపాటు ఒకే ఇంట్లో ఉన్నారని వెల్లడించారు. లావణ్య చెబుతున్న విషయాల్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఈ మేరకు పోలీసులు లావణ్య ఇంటి నుంచి సాక్ష్యాలు సేకరించారు. కాగా, ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు.
రాజ్ తరుణ్ నా భర్తే అని లావణ్య చెబుతూ వస్తుంది. కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకొని కాపురం పెట్టినట్లు చెప్రుపింది. రాజ్ తరుణ్ వల్ల గర్భం దాల్చినట్లు, ఆ వివరాలను పోలీసులకు వెల్లడించినట్లు లావణ్య తెలిపింది. దీంతో ఆ ఆధారాలతో పోలీసులు విచారించారు. చివరికి ఇద్దరూ సహజీవనం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
రాజ్ తరుణ్‌ను నిందితుడి పోలీసులు ఛార్జీ షీట్ చేయడంపై లావణ్య స్పందించారు. పోలీస్ ఛార్జ్ షీట్‌పై సంతోషం వ్యక్తం చేసింది. ధర్మమే గెలిచిందని, పోలీసులు నాకు న్యాయం చేశారని వెల్లడించింది. మాకు పెళ్లి అయిందని, గుడి దగ్గర తాళి కూడా కట్టాడని చెప్పుకొచ్చింది.
కొంతమంది మా ఇద్దరిని విడగొట్టారని, మా పెళ్లికి సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయని లావణ్య తెలిపారు. మాల్వీ మల్హోత్రా కారణంగా రాజ్ తరున్ నన్ను వదిలించుకున్నాడని ఆరోపించింది. ఇప్పటికీ కూడా మాల్వీతోనే ఉన్నాడని, దయచేసి రాజ్ తరుణ్‌ను వదిలేయాలని సూచించింది.
రాజ్ తరుణ్ నిందితుడే..
హీరో రాజ్‌తరుణ్-లావణ్య కేసులో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చి.. చార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు.
లావణ్యతో రాజ్‌తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్టు పేర్కొన్న పోలీసులు.
పదేళ్లపాటు రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారు: పోలీసులు
లావణ్య చెప్తున్న దాంట్లో… pic.twitter.com/XPqnvKyGfd
— BIG TV Breaking News (@bigtvtelugu) September 6, 2024