Priyanka Jain: బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి ప్రియాంక జైన్(Priyanka jain), శివకుమార్(Shiva Kumar) జంట ఒకటి. వీరిద్దరూ బుల్లితెరపైకి మౌనరాగం అనే సీరియల్ ద్వారా జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సీరియల్ ద్వారా ప్రియాంక శివకుమార్ తమ నటన ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారు. ఈ సీరియల్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారడంతో అప్పటినుంచి ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇక ప్రస్తుతం వీరిద్దరూ పలు బుల్లితెర సీరియల్స్ అలాగే బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఉన్నారు.
పెళ్లి ప్రపోజల్…
ఇక ప్రియాంక జానకి కలగనలేదు అనే సీరియల్ ద్వారా తెలుగులో మరింత గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా ఈమె మరింత ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్న సమయంలోనే ప్రియాంక పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. తాను బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళగానే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. ఇక బిగ్ బాస్ (Bigg Boss)అయిపోయి కూడా దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు వీరు పెళ్లి(Marriage) గురించి మాత్రం ఎక్కడా ప్రకటించలేదు.
అండమాన్ నికోబార్…
ఇలా ప్రతిసారి ప్రియాంకకు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవడం ఆమె త్వరలోనే అంటూ సమాధానం చెప్పడం వరకు మాత్రమే ఉంది తప్ప ఇప్పటివరకు పెళ్లికి సంబంధించి ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ప్రియాంక తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు చూస్తుంటే మాత్రం తన ప్రియుడు శివకుమార్ కు చాలా సర్ప్రైజ్ ప్రపోజల్ చేసినట్టు తెలుస్తుంది. జూన్ 8వ తేదీ శివకుమార్ పుట్టినరోజు కావడంతో ఈమె తన ప్రియుడితో కలిసి అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ తన ప్రియుడు శివకుమార్ పుట్టినరోజు వేడుకలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు.
అండమాన్ నికోబార్ దీవులలో శివకుమార్ పుట్టినరోజు వేడుకలను జరపడమే కాకుండా ఈమె పెద్ద ఎత్తున పువ్వులతో డెకరేషన్ చేయించి తనకు సర్ప్రైజ్ ఇస్తూ నన్ను పెళ్లి చేసుకుంటావా? అని మోకాలిపై కూర్చుని ప్రపోజల్ చేసింది. ఇలా ప్రియాంక ప్రపోజల్ చేయడంతో వెంటనే శివకుమార్ తప్పకుండా అంటూ గట్టిగా తనని హగ్ చేసుకుని తన ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరు తమ పెళ్లి గురించి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని భావించి ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ ఈ జంట ఎప్పుడు ప్రకటిస్తుందో వేచి చూడాలి.. ఇక ప్రస్తుతం శివకుమార్ నిన్ను కోరి అనే సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉండగా ప్రియాంక మాత్రం ఎలాంటి సీరియల్స్ కమిట్ అవ్వకుండా బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.