BigTV English

Actor Darshan: జడ్జి కొడుకుపైనే దాడి.. బిగ్ బాస్ ఫేం నటుడు అరెస్ట్

Actor Darshan: జడ్జి కొడుకుపైనే దాడి.. బిగ్ బాస్ ఫేం నటుడు అరెస్ట్

Actor Darshan : ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ మనందరికీ తెలిసిందే. అన్ని భాషల్లోనూ క్రేజ్‌ని సంపాదించుకున్న టీవీ షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ అని చెప్పొచ్చు. ఈ షో ద్వారా చాలామంది పాపులర్ అయ్యారు. కొంతమంది సినిమాల్లో, మరి కొంతమంది సీరియల్స్ లో రాణిస్తున్నారు. ఇంకొంతమంది వివిధ రంగాల్లో సెటిల్ అయ్యారని చెప్పొచ్చు. తమిళం లో విజయ్ సేతుపతి, కమలహాసన్ యాంకర్స్ గా వ్యావహారించారు. బిగ్ బాస్ షో ద్వారా తెలుగులో కూడా చాలామంది పాపులర్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ షో లాంగ్వేజ్ ఏదైనా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు.ఈ షో ద్వారా క్రేజ్  సంపాదించుకున్న యాక్టర్స్ లో ఒకరు దర్శన్. తాజాగా బిగ్ బాస్ ఫ్రేమ్ దర్శన్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..


దర్శన్ వివాదం..

తమిళంలో విజయ్ టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా పాపులర్ అయ్యాడు దర్శన్. తమిళంలో బిగ్ బాస్ మంచి ప్రేక్షకాదరణ పొందిన షో. బీబీ సీజన్ లో 3 ఓ కంటెస్టెంట్ గా వచ్చిన దర్శన్ చాలా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా దర్శన్ జైలు పాలయ్యాడు. అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కార్ పార్కింగ్ దగ్గర జరిగిన గొడవలు దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కార్ పార్కింగ్ తగాదా లో న్యాయమూర్తి కొడుకు పై దాడి చేయడంతో దర్శన్ పెద్ద ప్రాబ్లంలో చిక్కుకున్నాడు అని చెప్పొచ్చు.


బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్..

పోలీసులు చెప్పిన దాని ప్రకారం, శ్రీలంకకు చెందిన దర్శన్ తమిళంలో విజయ్ టీవీలో బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా అందరికీ పరిచయమయ్యాడు. గూగుల్ కుట్టప్ప సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత కొన్ని సినిమాలు చేశాడు. ఇతను చెన్నైలోనే ఉంటున్నట్లు సమాచారం. తన ఇంటి ముందు ఉన్న టీ షాప్ లోనే ఈ గొడవ జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. దర్శన్ ఇంటి ముందే ఉన్న టీ స్టాల్ దగ్గర రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా దర్శన్ ఇంటి ముందు పార్కింగ్ చేస్తూ ఉంటారు. టీ స్టాల్ దగ్గరకి వచ్చిన వారందరూ దర్శన్ ఇంటి ముందు పార్కింగ్ చేయటం గొడవకు కారణం. అలా హైకోర్టు న్యాయమూర్తి కొడుకు ఆత్తిచూడి అనే వ్యక్తి దర్శన్ ఇంటి ముందు కార్ పార్కింగ్ చేశాడు. అది చూసిన దర్శన్ అతడితో గొడవకి దిగాడు. కారు తీయమని చెప్పాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ పెద్దది అయ్యి ఇద్దరూ కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. ఈ గొడవలో హైకోర్టు న్యాయమూర్తి కొడుకు ఆత్తిచుడి, అతని అత్త మహేశ్వరి కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. వాళ్ళు పెట్టిన కేసు ఆధారంగానే పోలీసులు దర్శన్ ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వారి ఇరువురు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.. వీరిపై కూడా దర్శన్ తిరిగి కేసు పెట్టినట్లు తెలుస్తుంది. పోలీసులు బిగ్ బాస్ ఫేమ్ దర్శన్ తో సహా ఆయన సోదరుడు లోకేష్ ని కూడా అరెస్ట్ చేసినట్టు సమాచారం. దర్శన్ ఈ వివాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×